అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఏం జరిగింది.?

ప్రస్తుతం ఆ దరఖాస్తు బ్లాక్ లిస్టులో ఉండడంతో శివ చలపతి భార్య సౌజన్య అర్ధంతరంగా ఇండియాకు తిరుగు ప్రయాణమవ్వాల్సి వచ్చింది.

news18-telugu
Updated: November 1, 2019, 10:15 PM IST
అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఏం జరిగింది.?
శివ చలపతి రాజు (Image:gofundme)
  • Share this:
అమెరికాలో ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శివ చలపతి రాజు మృతి చెందారు. మృతుడి ఫేస్‌బుక్ వివరాల ప్రకారం.. అతడి స్వస్థలం గోదావరి జిల్లాలకు చెందిన ప్రాంతమని తెలుస్తోంది. నార్త్ కరోలినాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శివ చలపతి రాజు మంగళవారం మరణించారు. ఐతే ఎలా చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది. ఆయన కుటుంబం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డుకు దరఖాస్తుకు చేరుకుంది. ప్రస్తుతం ఆ దరఖాస్తు బ్లాక్ లిస్టులో ఉండడంతో శివ చలపతి భార్య సౌజన్య (గర్భిణి) అర్ధంతరంగా ఇండియాకు తిరుగు ప్రయాణమవ్వాల్సి వచ్చింది.

రాజమండ్రిలో చదువుకున్న శివ చలపతి అమెరికాలో విప్రో, బ్రిటిష్ పెట్రోలియం సహా పలు సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఒరాకిల్‌లో సాఫ్ట్ వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న ఆయన మంగళవారం అకాల మరణం చెందారు. శివ చలపతి రాజు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అంత్యక్రియల కోసం పీడిమాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ (pata) సంస్థ 'గో ఫండ్ మీ' ద్వారా విరాళాలను సేకరిస్తోంది.

First published: November 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com