Home /News /andhra-pradesh /

TELUGU TALLI STATUE NEGLECTED BY ANDHRA PRADESH OFFICIALS ON THE DAY OF TELUGU LANGUAGE NK GNT

తెలుగు భాషా దినోత్సవం: తెలుగు తల్లికి అవమానం... ఏదీ మల్లెపూదండ?

తెలుగు భాషా దినోత్సవం: తెలుగు తల్లికి అవమానం... ఏదీ మల్లెపూదండ?

తెలుగు భాషా దినోత్సవం: తెలుగు తల్లికి అవమానం... ఏదీ మల్లెపూదండ?

అధికారులు ఎంత బిజీగా ఉన్నా... కొన్ని కార్యక్రమాల్ని తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. తెలుగు భాషా దినోత్సవం నాడు తెలుగు తల్లిని మర్చిపోతే ఎలా? కనీసం ఆ రోజైనా స్మరించుకోవాలి కదా?

    గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో స్టేషన్ రోడ్డు రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర్లో ఉన్న తెలుగు తల్లి విగ్రహం వెలవెలబోతోంది. ఇవాళ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నరసరావుపేట పురపాలక సంఘం అధ్వర్యంలో క్యాలెండర్ ప్రకారం వేడుకలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇంతకంటే ముఖ్యమైన పనులేవో ఉన్నట్లు... అసలు అధికారులు... అమ్మను పట్టించుకోనేలేదు. పట్టణంలో ఎంతోమంది మేధావులు, కవులు, కళాకారులు, తెలుగు పండితులు, తెలుగు భాషాభిమానులు ఉన్నారు. ఈ విషయం తెలిస్తే వాళ్లంతా ఆవేదన చెందుతారు. ఏటా తెలుగు భాషా దినోత్సవం నాడు తెలుగు తల్లి విగ్రహాలకు కొత్తగా పెయింటింగ్ వేయించి, పూలమాలలు వేసి... తెలుగు భాష గొప్పదనం గురించి మాట్లాడుకునేవారు. ఈసారి అక్కడ అలా జరగకపోవడంతో... తెలుగు తల్లి మౌనంగా చూస్తోంది.

    ఏటా ఆగస్ట్ 29న తెలుగు రాష్ట్రాలు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాయి. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మదినం సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఏటా ఈ రోజున ప్రభుత్వం తెలుగు భాష కోసం కృషి చేసేవారికి అవార్డులు ఇస్తోంది. ప్రభుత్వం తరపున... సాంస్కృతిక విభాగం ఈ బాధ్యతలు నిర్వహిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Telugu language

    తదుపరి వార్తలు