హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఎక్కువైన చలి తీవ్రత.. ఆంధ్రాలో గజగజ..

ఎక్కువైన చలి తీవ్రత.. ఆంధ్రాలో గజగజ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. సాయంత్రం 6 గంటలు దాటిందంటే చాలు.. కాలు బయట పెట్టాలంటే గజగజ వణకాల్సి వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. సాయంత్రం 6 గంటలు దాటిందంటే చాలు.. కాలు బయట పెట్టాలంటే గజగజ వణకాల్సి వస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొన్న చలి ప్రభావం ఉత్తర కోస్తా వరకు విస్తరించింది. దాంతో కోస్తా జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువైంది. ఒడిశా మీదుగా వీస్తున్న గాలులతో మంగళవారం రాత్రి నుంచి చలి వాతావరణం మరింత ఎక్కువైంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. అక్కడ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు వణికిపోతున్నారు. కాగా, రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వుందని, అయితే ఎక్కువచోట్ల పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తర కోస్తాలో మాత్రం చలి వాతావరణం కొనసాగుతుందన్నారు.

Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: AP News, Telangana, WINTER

ఉత్తమ కథలు