మోగిన బడిగంట... ఏపీలో విద్యార్థులకు అందనున్న అమ్మఒడి కానుక

ఈనెల 15 వరకు ఏపీలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తరగతులుంటాయి.

news18-telugu
Updated: June 12, 2019, 8:35 AM IST
మోగిన బడిగంట... ఏపీలో విద్యార్థులకు అందనున్న అమ్మఒడి కానుక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలలుగా మూతపడ్డ స్కుల్ తలుపులు తెరుచుకున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో బుధవారం పాఠశాలలన్నీ పున: ప్రారంభమయ్యాయి. దీంతో నిన్నమొన్నటివరకు చక్కగా ఆటపాటలతో ఎంజాయ్ చేసిన పిల్లలంతా బడి బాట పట్టారు. బ్యాగ్ తగిలించుకొని బడికి క్యూ కట్టారు. వాస్తవానికి జూన్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉండగా... ఎండలు ఎక్కువగా ఉండటంతో జూన్ 11 వరకు సెలవుల్ని పొడిగించింది. 2019-2020కు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది కూడా జూన్ 12న పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.

2020 ఏప్రిల్ 23వ తేదీని చివరి పనిదినంగా ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవువు, ఈ ఏడాది దసరా సెలవుల్ని సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు ప్రకటించారు. అయితే ఈనెల 15 వరకు ఏపీలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తరగతులుంటాయి. 16న ఆదివారం కావటంతో 17వ తేదీ నుండి యధావిధిగా స్కూల్స్‌ రోజు మొత్తం కొనసాగిస్తారు. వేసవిలో విద్యార్థులు ఎన్నో ఆటలు, పాటలు, పర్యటనలు, వేసవి శిబిరాలు వంటి ఎన్నో మధురానుభూతులను మదిలో నిలుపుకొని పాఠశాలలకు పయనమవుతున్నారు.

మరోవైపు ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అమ్మఒడి పథకాన్ని 2020 జనవరి 26 నుండి అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలను ప్రభుత్వం అందివ్వనుంది. అయితే ఈ పథకాన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా వర్తింప చేయాలనే క్యాబినెట్‌ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ విద్యాసంస్థలు పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు పరిమితం చేయాలని డిమాండ్‌ వస్తుంది.
Published by: Sulthana Begum Shaik
First published: June 12, 2019, 8:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading