ప్రముఖ సినీ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

సెప్టెంబర్ 22 , 1936లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు విజయ బాపినీడు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 1:03 PM IST
ప్రముఖ సినీ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత
చిరంజీవితో విజయ బాపినీడు (ఫైల్ ఫోటో)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 1:03 PM IST
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 ఏళ్లు. ఇండస్ట్రీకి రాకముందు విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా విజయ బాపినీడు పనిచేసారు. చిరంజీవి, శోభన్ బాబు వంటి ప్రముఖ హీరోలతో సినిమాలు నిర్మించారు. అప్పట్లో చిరంజీవి, బాపినీడు కాంబినేషన్ హిట్ అయ్యింది. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఖైదీ నెంబర్ 786, మగధీరుడు, సుమంగళి,వాలుజడ తోలు బెట్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు బాపినీడు దర్శకత్వం వహించారు.

మెగాస్టార్‌తో బాపిినీడు


1976 నిర్మించిన యవ్వనం కాటేసింది అనే సినిమాకు బాపిినీడు నిర్మాతగా మారారు.సెప్టెంబర్ 22 , 1936లో సీతారామ స్వామి, లీలావతి దంపతులకు ...పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన బీఏ వరకు చదువుకున్నారు. ఏలూరు సీఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

vijaya bapineedu no more
అక్కినేనితో బాపినీడు ( ఫైల్ ఫోటో)
మరోవైపు బాపినీడు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖులంతా బాపినీడు మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...