• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • TELUGU LANGUAGE DO YOU KNOW THESE THINGS ABOUT YOUR MOTHER TONGUE TELUGU LANGUAGE GH SK

Praise of Telugu: దేశ భాషలందు తెలుగు లెస్స.. మన మాతృభాష గురించి ఈ విషయాలు తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం (Image:Shutterstock)

Telugu Language: తెలుగు భాషలోని ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. తెలుగు భాషలోనే అత్యధిక సంఖ్యలో సామెతలు ఉన్నాయి. తెలుగు భాషను తెనుంగు లేదా తెలుంగు అని కూడా పిలుస్తారు

  • Share this:
భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. తెలుగు భాష చరిత్ర, పదకోశం చాలా గొప్పది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని కొనియాడారు. అలాగే ఇటాలియన్​ వర్తకులు తెలుగు భాషను ‘ఇటాలియన్​ ఆఫ్​ ది ఈస్ట్’​గా పిలిచారు. అంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అందుకే ‘తెలుగులోనే మాట్లాడాలి. తెలుగులోనే రాయాలి. తెలుగులోనే పాలన చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్పు రావాలి’ అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల పేర్కొన్నారు. అయితే, పరభాషా ధ్యానంలో పడి మాతృ భాషనే మర్చిపోయే ప్రమాదం ఏర్పడింది. అందువల్ల, నేటి తరం తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు తెలుగు భాష ఎలా పుట్టింది? దాని విశిష్టత ఏంటి? ప్రత్యేకత ఎంటి? వంటి విషయాలు తెలుసుకుందాం.

తెలుగు భాష అత్యంత ప్రాచీనమైనది. క్రీస్తుపూర్వం 400 నుండి తెలుగు భాష ఉనికిలో ఉంది.
తెలుగు భాషా లిపి, పదకోశం చాలా గొప్పది. అందుకే, ప్రపంచంలోని 2వ ఉత్తమ స్క్రిప్ట్‌ ఉన్న భాషగా 2012లో అంతర్జాతీయ ఆల్ఫాబెట్ అసోసియేషన్ తెలుగును ఎంపిక చేసింది.
తెలుగు భాష మాట్లాడటం ద్వారా మన శరీరంలో సుమారు 72000 నరాలు యాక్టివేట్ అవుతాయి. ఇది సైంటిఫిక్​గా నిరూపితమైంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. భారత దేశంలోని అనేక ప్రాంతాల్లో తెలుగు మాట్లాడతారు. అంతేకాదు, శ్రీలంకకు చెందిన జిప్సీ జాతి ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.
మయన్మార్‌లోనూ ఒక జాతి వారు తెలుగు మాట్లాడతారు.
16వ శతాబ్దంలో ఇటాలియన్ ఎక్స్‌ప్లోరర్ నికోలో డి కాంటి.. తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్‌లోని మాదిరిగానే అచ్చులతో ముగుస్తుందని కనుగొన్నారు. అందుకే దీనిని “తూర్పు ఇటాలియన్” గా అభివర్ణించారు.

భారతదేశంలో స్థానిక భాషలు మాట్లాడేవారి సంఖ్య 75 మిలియన్లుగా ఉంది. అయితే వారిలో అత్యధిక మంది ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 3వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల ఎథ్నోలాగ్ జాబితాలో 15వ స్థానంలో ఉంది.

"మూడు లింగాలు" ఉన్న త్రిలింగ దేశంగా భారతదేశాన్ని అభివర్ణిస్తారు. ఈ త్రిలింగ నుంచి తెలుగు అనే పదం వచ్చింది. హిందూ పురాణం ప్రకారం, శివుడు తెలంగాణలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తాలోని భీమేశ్వరం వంటి మూడు పర్వతాలపై.. లింగం రూపంలో అవతరించాడు.

తెలుగు భాషలోని ప్రతి పదం అచ్చు శబ్దంతో ముగుస్తుంది.
తెలుగు భాషలోనే అత్యధిక సంఖ్యలో సామెతలు ఉన్నాయి.
తెలుగు భాషను తెనుంగు లేదా తెలుంగు అని కూడా పిలుస్తారు.
అన్ని భారతీయ భాషల్లో కెల్లా తెలుగు భాష అతి మధురమైనదని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అభివర్ణించారు.

సుమారు 200 సంవత్సరాల క్రితం 400 మంది తెలుగు ప్రజలను మారిషస్​కు తోటలో పనిచేయడానికి కార్మికులుగా తీసుకువెళ్లారు. ఇప్పుడు వారి వారసుల్లో ఒకరు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు.
రామాయణం, మహాభారతంలోని అనేక తెలుగు శ్లోకాల్లో 40 శ్లోకాలను పాలిండ్రోమ్​తో రాశారు. అంటే, ముందు నుంచి వెనక్కు చదివినా లేక వెనుక నుంచి ముందుకు చదివినా ఒకే అర్థం వస్తుంది. ఇలాంటి ప్రత్యేకత ఉన్న భాష మరొకటి లేదు.

శ్రీ కృష్ణదేవరాయలు శ్రీకాకుళంలోని విష్ణు దేవాలయాన్ని సందర్శించి అక్కడే ఆముక్తమాల్యద కావ్యాన్ని రాశారు. "దేశ భాషలందు తెలుగు లెస్సా" అని కొనియాడారు. ఆయన ఆధీనంలో ఉన్న అన్ని ప్రావిన్స్​లలో తెలుగు భాషను అధికారిక భాషగా చేశారు.
ఏ భాషలో లేని విధంగా ఒక్క తెలుగులోనే ఏకాక్షర పద్యం ఉంది. అంటే ఒకే అక్షరంతో పద్యం ముగుస్తుంది. ఇంతటి గొప్ప భాష కాబట్టే ప్రాచీన కవులు, కళాకారులు మనకు అందించిన గొప్ప వారసత్వ సంపదగా తెలుగును అంతా కొనియాడుతారు. అందుకే తెలుగు మాట్లాడే వ్యక్తులుగా గర్వపడదాం. తెలుగు ఔన్నత్యాన్ని నలుదిశలా చాటుదాం.
Published by:Shiva Kumar Addula
First published: