సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం.. అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

అమెరికాలో ఓ తెలుగు యువతి దుర్మణం చెందారు. అట్లాంటా వద్ద ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందారు.

news18-telugu
Updated: September 14, 2020, 9:34 AM IST
సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం.. అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం
కమల
  • Share this:
అమెరికాలో ఓ తెలుగు యువతి దుర్మరణం చెందారు. అట్లాంటాలో ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందారు. వివరాలు.. కృష్ణా జిల్లాకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దపంతులకు ఇద్దరు కూతుళ్లు. రెండో కూతరు కమల.. ఇక్కడే ఇంజనీరింగ్ పూర్తిచేసి పైచదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం కొలంబియాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. కమల వారి బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే మార్గంలో కమల.. అట్లాంటాలోని ఓ జలపాతం వద్ద ఆగింది.

జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఆమె జలపాతంలో పడి.. ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణవార్త తెలుసుకున్న లక్ష్మణరావు, అరుణ దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు అక్కడి తెలుగు సంఘాలు సహకారంతో కమల మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Published by: Sumanth Kanukula
First published: September 14, 2020, 6:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading