హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Josh in TDP: ఆ జిల్లాలో టీడీపీ దూకుడు.. అధికార పార్టీకి వరుస షాక్ లు

Josh in TDP: ఆ జిల్లాలో టీడీపీ దూకుడు.. అధికార పార్టీకి వరుస షాక్ లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telugu desam Party: తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఏపీలో దారుణంగా ఉంది అన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే 2019 ఎన్నికల నుంచి వరుస ఓటములు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ టీడీపీలోకి భారీగా వలసలు వస్తున్నారు.. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు.. అసలు ఈ వలసలకు కారణం ఏంటి..?

ఇంకా చదవండి ...

Andhra Pradesh Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఢీలా పడిపోయింది అనుకున్న తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) మళ్లీ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 2019 సాధారణ ఎన్నికల నుంచి వరుస ఓటములు వెంటాడుతున్నాయి. కంచు కోటలు కూడా బద్ధలవుతున్నాయి. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrbabu Naidu) సొంత నియోజకవర్గం.. ఆయనకు అడ్డాగా చెప్పుకునే కుప్పం (Kuppam)లోనూ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి భారీ షాక్ తప్పలేదు. మున్సిపాలిటీని అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP) సొంతం చేసుకుంది.  పార్టీ పని అయిపోయిందని విమర్శలు వస్తున్న సమయంలో..  టీడీపీ వైపు చాలామంది నేతలు చూస్తుండడం ఆ పార్టీ కేడర్ కు ఫుల్ జోష్  ఇస్తోంది..

గత సాధారణ ఎన్నికల్లో ఘోరంగా భంగాపడ్డ  శ్రీకాకుళం జిల్లా (Srikakulam)లో టీడీపీ ఇప్పుడు దూకుడు పెంచుతోంది. దీంతో జిల్లాలోని వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు. పలు మండలాల్లోని వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో సహా భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారు.  2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం  చేయడానికి రంగంలోకి దిగారు జిల్లా టీడీపీ నేతలు..

ఇదీ చదవండి : నేనే ప్రత్యక్ష సాక్షిని.. ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందంటే..? క్లారిటీ ఇచ్చిన స్పీకర్

ఇటీవల జరిగిన స్ధానిక సంస్ధల మలిదశ ఎన్నికల్లో జిల్లాలో ఓ మంత్రితో పాటు స్పీకర్ సొంత నియోజవర్గాలలో పలు స్ధానాల్లో టీడీపీ తీవ్ర ఒత్తిడిని తట్టుకొని మరీ కొన్ని స్ధానాల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇక ఇటీవల అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో కూడా కొన్ని వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి.

ఇదీ చదవండి : సీఎం అవ్వాలన్న ఆశ.. ఆకాంక్ష రెండూ ఉన్నాయి.. టీడీపీతోనే అనుబంధం.. ఆయన మనసులో మాట ఇదే

టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి జిల్లా పెట్టని కోట. అన్ని ఎన్నికల్లో ఆ పార్టీకి జిల్లా ప్రజలు ఆదరిస్తూ వచ్చారు.  2019 ఎన్నికల్లో ఆ పార్టీ రెండు తప్పా అన్ని నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసింది. టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలవగలిగింది. మిగిలిన 8 నియోజకవర్గాల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇక ఆ తర్వాత వచ్చిన స్దానిక సంస్ధల ఎన్నికల్లోనూ వైసీపీ 90 శాతం స్ధానాలను కైవసం చేసుకుంది. దీంతో అప్పటి నుంచి పార్టీలో స్తబ్దత నెలకొంది.

ఇదీ చదవండి : మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నారు.. తిట్టుకున్నారు.. తొడలుకొట్టుకున్నారు.. ఇప్పుడు చేయి చేయి కలిపారు

అలాంటి సమయంలోనూ టీడీపీ నేతలు పక్కా ప్లాన్  తో వైసీపీ కేడర్ పై ఫోకస్ చేశారు. దీంతో  శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కి భారీ షాక్ ఇస్తూ.. రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాలవలస మండలం చిన్న శిర్లాం పంచాయతీలో వైసీపీకి చెందిన 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

ఇదీ చదవండి : ఏపీ సీఎం జగన్ కంటే ఉత్తర కొరియా కిమ్ నయం..? ఎందుకంటే..? లోకేష్ కామెంట్

చిన్నశిర్లాం వైసీపీ ప్రధాన నాయకుడు, ఇటీవల సర్పంచ్‌గా పోటీ చేసిన మజ్జి శ్రీనివాసరావు, ఇతర వార్డు మెంబర్లు, వందలాది మంది అనుచరులు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌, మండల  పార్టీ అధ్యక్షుడు  కిమిడి అశోక్‌బాబు కండువాలు వేసి ఆహ్వానించారు. జగన్‌ పాలన నచ్చక, గ్రామంలో అభివృద్ధి కుంటుపడడంతో టీడీపీలో చేరినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చదవండి :టీడీపీ నేతలకు వార్నింగా..? వైసీపీ మైండ్ గేమా..? కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల స్ట్రాటజీ అదే..?

రాజాం నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ భారీ చేరికలు జరిగాయి. ఉంగరాడ వైసీపీ సర్పంచ్ శోభారాణి, ఆమె భర్త భుజంగరావు నేత్ళత్వంలోని 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ప్రభుత్వంపై అసంతృప్తి తో ఉన్నామని, వైసీపీ అవినీతి పాలన, స్త్రీలకు కనీస గౌరవం దక్కలేని పరిస్థితుల నేపధ్యంలోనే వైసీపీని వీడి టీడీపీ లో చేరుతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఇదీ చదవండి : వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వారి పేర్లు చెప్పాలని బలవంతం చేస్తున్నారంటూ ఫిర్యాదు

ఇక జిల్లాలో ఇటీవల జరిగిన స్ధానిక సంస్ధల మలిదశ ఎన్నికల్లో టీడీపీ బాగా పుంజుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, రాజాం, ఎచ్చెర్ల, ఆముదాలవలస నియోజకవర్గాలల్లో పలు చోట్ల టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి కూడా గట్టి షాక్‌ తగిలింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో స్పీకరు సతీమణి తొగరాం సర్పంచిగా ఎన్నికయ్యారు. కానీ ఎంపీటీసీ స్థానానికి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి తమ్మినేని భారతమ్మ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై 648 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇదీ చదవండి : ఒమిక్రాన్ తరుముకొస్తోంది.. నిర్లక్ష్యం వద్దు మిత్రమా.. మాస్క్ మస్ట్ అని గుర్తించండి..

జిల్లాకు చెందిన మంత్రి నియోజకవర్గం పలాసలో కూడా టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. పలాస నియోజకవర్గం మందస మండలంలో వైఎస్సార్‌సీపీ ఓడిపోయింది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాలవలసలో రెండు ఎంపీటీసీల్లో టీడీపీ గెలిచింది. ఆమదాలవలస మండలం కట్యాచారులుపేట  ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిపై 256 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బొడ్డెపల్లి సుగుణమ్మ విజయం సాధించారు.

ఇదీ చదండి: కృష్ణాలో లాహిరి లాహిరి.. సాగర్ అందాలు.. భవానీ ద్వీపం సొగసులు చూసొస్తారా..?

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడిప్పుడే మార్పు మొదలైందని, రానున్న రోజుల్లో తమ దూకుడు పెంచుతామని, టీడీపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేత్ళత్వంలో జిల్లాలోని టీడీపీ అభివ్ళద్దికి నాయకులంతా క్ళషి చేస్తున్నామని, వైసీపీ పతనం ప్రారంభమైనట్టేనని టీడీపీ నేతలు అంటున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Srikakulam, TDP

ఉత్తమ కథలు