హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Telugu Desam Party: చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా..? టీడీపీకి పూర్వ వైభవం వచ్చేనా..? ఆవిర్భావ దినోత్సం వేదికగా వ్యూహాలు..

Telugu Desam Party: చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా..? టీడీపీకి పూర్వ వైభవం వచ్చేనా..? ఆవిర్భావ దినోత్సం వేదికగా వ్యూహాలు..

Telugu Desam Party @40: చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవుతారా..? టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా..? లోకేష్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడతారా..? నిండా మునిగిన పార్టీకి దిక్కెవరు..? 2024 లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు ఏంటి..? పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ పార్టీకి ప్లస్ అవుతుందా..?

ఇంకా చదవండి ...

  Telugu Desam Party @40: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది.. ప్రస్తుతం ఆ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. దీంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నూతన ఉత్సాహం నింపింది అనే చెప్పాలి.. అందుకే ఈ సభ వేదకగానే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కొత్త వ్యూహాలకు పదును పెట్టినట్టు సమాచారం.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఇది అప్పట్లో ఓ రికార్డు. ఎందుకంటే పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై వ్యతిరేకత టీడీపీ (TDP)కి కలిసొచ్చింది. ఆ సమయంలో బీజేపీ (BJP) ఉన్నా ఆ పార్టీకి బలం లేదు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంది. ఎన్టీఆర్ ఐదేళ్ల పాటు.. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎం పీఠం అధిరోహించారు.

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది నేతల్లో సగానికి సగం పైగా టీడీపీ ఆనవాళ్లు ఉన్నవాళ్లే. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒకప్పుడు టీడీపీ నేతగా పనిచేశారు. చంద్రబాబుతో విభేదాల కారణంగా ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించుకున్నారు. కానీ గత 40 ఏళ్లలో టీడీపీ ప్రస్థానం అనేక ఆటుపోట్లకు గురైంది. ముఖ్యంగా తెలంగాణ విభజన తర్వాత టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

  ఇదీ చదవండి : ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలి.. లోక్ సభలో ఎంపీ డిమాండ్

  తెలంగాణలో ఆ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతయ్యింది. ఏపీలోనూ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలోనే ఉంది. కానీ అన్నీ వరుస దెబ్బలే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడింది. కేవలం 23 సీట్లకు పరిమితం అయ్యింది..? పోనీ ఏదో గాలి అనుకుంటే.. తరువాత ఏపీలో జరిగిన పలు ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటములు వెక్కిరించారు. అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం.. టీడీపీ కంచుకోట కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగిరింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనూ చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ థీమాగా ఉంది. మరి 2024 ఎన్నికల్లో పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకమే.

  ఇదీ చదవండి : ఇక జిల్లాలో వ్యాపారం చేయను.. వైసీపీ ఎంపీ ప్రతిజ్ఞ.. ఎస్పీ ఏమన్నారంటే..?

  సమస్యలనే అవకాశాలుగా మలుచుకోవాలి అన్నది చంద్రబాబు సిద్ధంతాం.. అందుకే ఓటములకు కుంగిపోకుండా.. తిరిగిన పుంజుకోవడం ఎలా అన్నదానిపైనే ఆయన ఫోకస్ చేశారు. 2024లో మళ్లీ టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు పార్టీ 40వ ఆవిర్భావ వేడుకనే వేదికగా చేసుకున్నారు. ఆ సభ వేదికగానే ఆయన వ్యూహ రచన చేసినట్టు సమాచారం. ఇకపై నుంచి తనతో పాటు.. లోకేష్ కూడా నిత్యం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎవరు ఎలా జనాల్లోకి వెళ్తారు అన్నదానిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

  ఇదీ చదవండి : మాజీ జేడీ ఆ పార్టీలో చేరుతున్నారా..? ఆయన టార్గెట్ ఎవరు..? పార్టీలో చేరేందుకు కండిషన్లు ఉన్నాయా..?

  అలాగే ఇకపై పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్ లాంటి వారితో పాటు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ లాంటి యువనేతలను పూర్తిగా రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు టాక్. అలాగే ముందుస్తుగానే టికెట్లపై క్లారిటీ ఇవ్వాలని.. మొహమాటాలకు పోకుండా కేవలం గెలుపు గుర్రాలకే టికెట్లు అనే సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ తో పొత్తు తప్పని సరి అని.. అందు కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు