Chandrababu Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్ షోలకు.. భారీ బహిరంగ సభలకు అనుమతి లేదు. దీనికి సంబంధించి ప్రత్యేక జీవోను కూడా విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం (AP Government) .. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తే షరతులతో అనుమతి తప్పని సరి.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతల పర్యటనలపై మరిన్ని ఆంక్షలు అమలు కానున్నాయి. ఇదే సమయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు దేశం (Telugu Desam) అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.
దీనికి సంబంధించి చంద్రబాబు పర్సనల్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. కానీ చంద్రబాబు నుంచి రాత్రి 10.30 గంటల వరకు సరైన సమాధానం రాలేదన్నారు. అందుకే రోడ్ షో, సభలకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఏపీలో ఎలాంటి బహిరంగ సభలు.. రోడ్ షోలకు అనుమతి లేదని.. ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా సభలు నిర్వహించినా, అందులో పాల్గొన్నా.. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు చంద్రబాబు పర్యటనపై పలమనేరు డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. జీవో నెం.1 ప్రకారం సభలపై ముందుస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఇరుకు సందుల్లో, నేషనల్ హైవేలపై సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : సింగిల్ గా పోటీ చేస్తే టీడీపీ గెలిచే సీట్లు ఇవే.. ఏ జిల్లాలో ఎన్ని అంటే..?
కేవలం చంద్రబాబు నాయుడే కాదు.. ఎవరైనా సభలు, రోడ్ షోల వివరాలను అందించాలని సూచించారు. తాజా ఆంక్షల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై పోలీసులకు తమ అధినేత పర్యటన పూర్తి వివరాలు అందించామంటున్నారు. కానీ చంద్రబాబు వ్యక్తి గత కార్యదర్శికి ఇచ్చిన నోటీసుపై సమాధానం ఇవ్వడం ఆలస్యమైందని చెబుతున్నారు. పోలీసులు మాత్రం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి ఎలాంటి సమధానం రాకపోవడంతో రోడ్ షోలు, సభలకు అనుమతి నిరాకరించారు.
ఇదీ చదవండి : వైసీపీలో ఓటమి భయం మొదలైంది.. ఆ జీవో ఉద్దేశం అదే.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు టీడీపీ నేతలు. ఎవరు ఎలాంటి ఆటంకాలు కలిగించినా.. అధినేత పర్యటనను అడ్డుకోలేరని చెబుతున్నారు. చంద్రబాబు సభలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక.. ఇలా నియంతలా కొత్త చట్టాలను జగన్ ప్రభుత్వం తీసుకొస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kuppam, TDP