హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP Candidates List: చంద్రబాబు దూకుడు.. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే

TDP Candidates List: చంద్రబాబు దూకుడు.. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు.. లిస్ట్ ఇదే

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

TDP Candidates List: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. తన సహజశైలికి భిన్నంగా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఓ వైపు పొత్తుపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ఎక్కడికక్కడ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పైనల్ చేసిన అభ్యర్థుల జాబితా ఇదే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

TDP Candidates List: సాధారణంగా  తెలుగు దేశం  పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై ఒక ముద్ర ఉంది. ఎన్నికల చివరి నిమిషం వరకు అభ్యర్థిని ఫైనల్ చేయరని పేరు. ఇప్పటికు చంద్రబాబు ఎన్నికల్లో వ్యవహరించిన తీరు చూసిన వారెవరైనా ఇదే మాట.. చూద్దాం.. చేద్దాం అంటూ.. చివరి నిమిషంలో అప్పటి పరిస్థితుల బట్టి ఒక అభ్యర్థికి బీఫారం.. ఇచ్చేవారు.. దీంతో అప్పటి వరకు టికెట్ ఆశించిన నేతలు అతడికి వ్యతిరేకంగా పని చేయడం ఒక సమస్య అయితే.. టికెట్ వస్తుందో రాదో తెలియక ప్రచారంలో వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ (TDP) ఓటములకు ఇది కూడా ఒక కారణం అంటారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మారినట్టు ఉన్నారు. తన స‌హ‌జ‌శైలికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మార్పుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎన్నికలు చావో రేవో లాంటివి.. ఆ ఎన్నికల్లో ఓడితే.. ఇక రాజకీయంగా భవిష్యత్తు లేనట్టే.. పార్టీ నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. లేదా పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ సారి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.  వైసీపీ (YCP) ఎత్తులకు ఫై ఎత్తులు వేస్తున్నారు.

2024 ఎన్నిక‌ల్లో విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేయాలంటే.. గతంలో లా మొహమాటాలకు తావివ్వకూడదని ఫిక్స్ అయ్యారు. త‌నశైలిని మార్చుకున్నానని.. మీరు కూడా మారాలని నేతలకు పదే పదే చెబుతూ వస్తున్నారు. అలాగే పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని గౌర‌విస్తున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా.. సీట్ల విష‌యంలో చాలా కఠినంగా ఉంటున్నారు. పార్టీ కోసం ప‌నిచేయ‌క‌పోతే సీటు లేద‌ని వారికి ముఖంమీదే చెప్పేస్తున్నారు. ఈ విష‌యంలో ఎలాంటి ఒత్తిళ్లు పని చేయవు అంటున్నారు.

ఇటీవల కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఇన్‌ఛార్జుల‌తో స‌మావేశ‌మైన చంద్రబాబు.. వారికి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేశారు. ఎందుకంటే గతంలోలా చివ‌ర్లో సీటు ఇవ్వ‌డంవ‌ల్ల ఆ అభ్య‌ర్థికి ప్ర‌చారం చేసుకోవ‌డానికి, త‌గిన వ్యూహాలు రూపొందించుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌దని భావిస్తున్నారు. దీని కారణంగానే అభ్య‌ర్థి ఓడిపోవ‌డంతోపాటు పార్టీపై ప్ర‌భావం చూపుతోంది అంటున్నారు. అందుకే ఈసారి ఆయ‌న ముందుగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకుంటూ వ‌స్తున్నారు.

ఇదీ చదవండి : ఎన్నికల మూడ్ లో సీఎం జగన్.. అప్పుడే గేమ్ స్టార్ట్ చేశారా..?

అయితే ఓ వైపు పొత్తు పై ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు.. కుదిరితో జనసేన, బీజేపీతో కలిపి పొత్తు కుదురకోతే జనసేనతోనైనా ఎన్నికలకు వెళ్లాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగని పొత్తుల ఖరారు అయినంత వరకు వేచి చూడడం లేదు.. పొత్తులు ఉన్నాసరే.. ఎలాంటి సమస్య రాదు అనుకునే నియోజకవర్గాల్లో.. అంటే టీడీపీ బలంగా ఉందని భావిస్తున్న చోట.. ఇన్ఛార్జిలుగా కొన‌సాగుతున్న‌వారు అభ్య‌ర్థులుగా వారే ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌టి నుంచే అభ్యర్థులను ఖ‌రారు చేసుకుంటూ వస్తున్నారు.

ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీకి కారణం ఇదే..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఖరారు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు

1.అవ‌నిగ‌డ్డ: మండలి బుద్ధ‌ప్ర‌సాద్

2.పెన‌మ‌లూరు: బోడే ప్ర‌సాద్

3.సంత‌నూత‌ల‌పాడు: విజ‌య్‌కుమార్

4.మార్కాపురం: కందుల నారాయ‌ణ‌రెడ్డి

5.రాజంపేట: బ‌త్యాల చెంగ‌ల్రాయుడు

6.ఒంగోలు: దామ‌చ‌ర్ల జానార్థ‌న్

7.మైదుకూరు: పుట్టా సుధాక‌ర్ యాద‌వ్

8.ఆళ్ల‌గ‌డ్డ: భూమా అఖిల ప్రియ

9.పుంగ‌నూరు: చ‌ల్లా రామ‌చంద్రారెడ్డి

10.గుంటూరు తూర్పు: మ‌హ్మ‌ద్ న‌జీర్‌

11.పీలేరు: నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి

12.పులివెందుల: బీటెక్ రవి

13.డోన్: ధర్మవరం సుబ్బారెడ్డి

14.ఆముదాలవలస: కూన రవికుమార్

15. ముమ్ముడివరం: ఎమ్మెల్యే దాట్ల బాపిరాజు

చంద్రబాబు ఫైనల్ చేసిన ఎంపీ అభ్యర్థులు

కడప ఎంపీ: రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి

రాజంపేట ఎంపీ: గంటా నరహరి

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

ఉత్తమ కథలు