రతనాల సీమగా రాయలసీమ...తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్స్

రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సి ఉందన్న ఆయన.. రాయలసీమను రతనాలసీమగా చేసేందుకు తమ వంతుసాయం చేస్తామని వెల్లడించారు.

news18-telugu
Updated: August 12, 2019, 9:02 PM IST
రతనాల సీమగా రాయలసీమ...తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్,రోజా
  • Share this:
రాయలసీమపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఏపీ సీఎం జగన్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సి ఉందన్న ఆయన.. రాయలసీమను రతనాలసీమగా చేసేందుకు తమ వంతుసాయం చేస్తామని వెల్లడించారు. ఇద్దరం కలిసి తెలుగువారి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబోతున్నామని.. దీన్ని కొందరు జీర్ణించుకోవడం లేదని విమర్శించారు కేసీఆర్.

రాయలసీమ బాధలు నాకు తెలుసు. రాయలసీమకు గోదావరిజలాలు రావాల్సినన అవసరం ఉంది.  గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయి.  పట్టుదల, నిజాయతీ కలిగిన యువకుడు నాయకుడు ఏపీకి సీఎంగా ఉన్నారు. అది ఖచ్చితగా సాధ్యమవుతుంది. సుమారు వెయ్యి టీఎంసీలు నీళ్లు గోదావరి నుంచి పోయాయి.  సముద్రంలోకి పోతున్నాయి. వృథాగా పోయే నీటిని వాడుకుంటే బంగారు పంటలు పండుతాయి. రాయలసీమ అభివృద్ధికి మా వంతు సాయం చేస్తాం. రతనాల సీమగా మార్చడానికి రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సమన్వయంతో పనిచేస్తాం. 70 తెలుగు వారి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబోతున్నాం.
సీఎం కేసీఆర్


సీఎం కేసీఆర్ సోమవారం కాంచీపురం అత్తి వరద రాజ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కాంచీపురం వరదరాజు స్వామి ఆలయం దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో రోజా నివాసానికి వెళ్లి భోజనాలు చేశారు. ఈ సంద‌ర్భంగా స్వయంగా రోజా.. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యలకు వడ్డించారు. అనంతరం నగరి నుంచి హైదరాబాద్ వెళ్లారు సీఎం కేసీఆర్.
First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading