హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Telangana and AP: ఏపీ వేసిన ఆ రెండు కేసుల కారణంగానే విభజన ముందుకు సాగట్లేదు.. కేంద్రానికి తెలిపిన తెలంగాణ

Telangana and AP: ఏపీ వేసిన ఆ రెండు కేసుల కారణంగానే విభజన ముందుకు సాగట్లేదు.. కేంద్రానికి తెలిపిన తెలంగాణ

ajay bhalla

ajay bhalla

పెండింగ్‌ అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ సమీర్‌శర్మ, సోమేశ్‌కుమార్‌తో బుధవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఇరు రాష్ట్రాల వాదనలను తెలుసుకున్నారు.

  పెండింగ్‌ అంశాలపై (Pending Issues) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ సమీర్‌శర్మ, సోమేశ్‌కుమార్‌తో బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా 9Union Home Secretary Ajay Bhalla) ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఇరు రాష్ట్రాల వాదనలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు సామరస్యంగా పరిష్కారమయ్యేలా కేంద్ర ప్రభుత్వం తగిన తోడ్పాటు అందిస్తుందని అజయ్‌ భల్లా తెలిపారు. పవర్​ బిల్లుల కేసును కోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్​ విత్ డ్రా (Withdraw) చేసుకోవాలని తెలంగాణ కోరింది. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన పవర్​యుటిలిటీస్​ రూ.12,111 కోట్లు కాగా, టీఎస్ జెన్​కో చెల్లించాల్సిన బకాయిలు రూ.3422 కోట్లుగా ఉందని కేంద్రానికి విన్నవించింది.

  ఏపీ వేసిన రెండు కేసుల కారణంగా..

  సింగరేణి, దానికి అనుబంధంగా ఉన్న ఆప్మెల్  విభజనపై ఏపీ (AP) లేవనెత్తిన అంశాలను తెలంగాణ (Telangana) కొట్టిపారేసింది. వీటిని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చూడటానికి వీల్లేదని స్పష్టం చేసింది.  కేంద్ర హోంశాఖ తమ వాదనతో ఏకీభవించినట్లు తెలంగాణ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏపీ కొన్ని అంశాలపై హైకోర్టులో కేసు  (cases) వేసినందున వాటిని విత్ డ్రా చేసుకుంటే కానీ.. విభజన ముందుకు సాగదని తెలిపింది. ఇందులో తొమ్మిదో షెడ్యూల్​లో ఏపీ వేసిన రెండు కేసుల కారణంగా విభజన అసంపూర్తిగా మిగిలిపోయిందని పేర్కొంది. ఆ కేసులు విత్ డ్రా చేసుకుంటే తప్ప విభజన ముందుకు సాగదని  తెలంగాణ  (Telangana)  స్పష్టం చేసింది. డెక్కన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)కు కేటాయించిన 5 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, అయితే ఆ జీవోపై ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి స్టే ఆర్డర్ పొందినట్లు పేర్కొన్నారు.

  ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తీసుకోవాలనుకుంటే.. దానిని కూడా వ్యతిరేకిస్తూ ఏపీ సర్కారు కోర్టులో స్టే తెచ్చుకుందని పేర్కొన్నారు. ఇక పదో షెడ్యూల్లో ఉన్న ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు సుప్రీం కోర్టు జారీ చేసిన ఆర్డర్స్ ప్రకారం 2017లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులనే మిగిలిన అన్ని సంస్థలకు వర్తింపజేయాలన్నారు. దీనిపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందని, అది విత్ డ్రా చేసుకుంటే తప్ప పదో షెడ్యూల్ సంస్థల విభజన ముందుకు పడదని పేర్కొంది. ఇక ఢిల్లీలో ఆంధ్రా భవన్ కేటాయింపులు చేపట్టేందుకు శ్రీరామకృష్ణారావు, ఎస్పీతో కూడిన కమిటీ వేయాలని తెలంగాణ సూచించగా, దీనికి ఏపీ అంగీకరించింది.

  సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి తెలంగాణ (Telangana) కు తక్కువ ధరకు అందలేదని తెలిపింది. ఫలితంగా తెలంగాణ డిస్కంలు ఎక్కువ ధరలకు విద్యుత్​ను ఇతర ప్రాంతాల నుంచి కొనాల్సి వచ్చిందని పేర్కొంది. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్​ ఇవ్వలేదన్నారు. ముందు ఏపీ కేసు విత్ డ్రా చేసుకుంటే లెక్కలు సెటిల్ అవుతాయని తెలిపారు. ఎఫ్​డీ ల విభజనను పరిశీలించేందుకు ఇద్దరు నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి సూచించారు.

  ఆంధప్రదేశ్‌ (Andhra pradesh)కు 2014 – 15కి సంబంధించి రెవెన్యూ లోటు నిధులను చెల్లించాలని ఏపీ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ సమావేశంలో ప్రస్తావించారు. పోలవరానికి నిధులు, గ్రీన్‌ఫీల్డ్‌ క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు తదితరాలను అజయ్‌ భల్లా దృష్టికి తెచ్చారు. కడపలో స్టీల్‌ ప్లాంటు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాల ఆవశ్యకతను వివరించారు. దుగ్గరాజుపట్నం ఓడరేవుకు బదులుగా రామాయపట్నం రేవు అభివృద్ధి, విశాఖపట్నం–చైన్నై పారిశ్రామిక నడవా, కేంద్రం నుంచి పన్ను రాయితీ బకాయిల గురించి కూడా ప్రస్తావించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Andhrapradesh, AP Telangana border, AP Telangana Water Fight, Telangana

  ఉత్తమ కథలు