Home /News /andhra-pradesh /

TELANGANA MOUNTAINEER AMGOTH TUKARAM GETS A FINANCIAL ASSISTANCE FROM AP CM YS JAGAN SU

YS Jagan: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సహాయం.. అలా సీఎం కార్యాలయం నుంచి పిలుపు..

(Image-Instagram)

(Image-Instagram)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. తెలంగాణ పర్వతారోహకుడు అంగోతు తుకారామ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. తెలంగాణ పర్వతారోహకుడు అంగోతు తుకారామ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. అతనికి ఆర్థిక సాయం అందజేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో తుకారామ్‌..సీఎం జగన్‌ను కలిశాడు. తాను సాధించిన పర్వతారోహణ వివరాలను సీఎంకు తెలియజేశాడు. అతడి విజయాలను అభినందించిన సీఎం జగన్.. అతనికి రూ. 35 లక్షల చెక్కును అందించారు. ఇక, అంగోతు తుకారామ్ (Amgoth Tukaram) స్వస్థలం.. రంగారెడ్డి జిల్లా యాచారం‌లో తక్కెళ్లపల్లి తండా. అతడు ఎవరెస్టు శిఖరంతో పాటు ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.

    ‘ఇటీవల నేను సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Telangana Governor Tamilisai Soundarajan), వైఎస్ భారతి ( YS Bharathi) చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. అవార్డును తీసుకున్న తర్వాత నా విజయాలు, నేపథ్యం, భవిష్యతు ప్రణాళికల గురించి జగతి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ చైర్‌పర్సన్ వైఎస్ భారతి ఆరా తీసి నా నెంబర్ తీసుకున్నారు. ఆ తర్వాత నాకు ఏపీ సీఎంవో నుంచి విజయవాడ రావాలని పిలుపు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ నా విజయాల గురించి తెలిసి సాయం చేసినందుకు నాకు చాలా సంతోషమేసింది. నా భవిష్యత్తు కలలను నేరవేర్చడానికి ప్రోత్సహకంగా రూ. 35 లక్షలు ఇస్తున్నట్టుగా చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఆయన నా గురించిన వివరాలను శ్రద్దగా విన్నారు’అని తుకారామ్ చెప్పినట్టుగా The Hindu పేర్కొంది.

    YS Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు.. చివరి నిమిషంలో నిర్ణయం.. కారణమిదే..

    ఇక, ఇప్పటికే ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తుకారా.. తర్వాత అంటార్కిటికాలోని( Antarctica) మౌంట్ విన్సన్, ఉత్తర అమెరికాలోని (North America) మౌంట్ డెనాలిని అధిరోహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇది వీలు పడటం లేదు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తుకారం.. ఆ పర్వతాలను అధిరోహించేందుకు షెడ్యూల్ నిర్ణయించుకోనున్నారు.

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల జాతర... 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

    ఇక, పర్వతారోహకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంగోతు తుకారామ్‌ను పలువురు ప్రముఖులు అభినందించారు. అతని విజయాలను ప్రశంసించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు