Andhra Pradesh: వైఎస్ నరరూప రాక్షసుడు.. పీజేఆర్ మృతికి కారణం కాదా? మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైెఎస్ రాజశేఖర్ రెడ్డి (ఫైల్ ఫోటో)

ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి యుద్దం తీవ్రమవుతోంది. మొన్నటి వరకు సఖ్యంగా ఉన్నట్టు కనిపించిన రెండు ప్రభుత్వాలు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ కలిసి కూర్చుంటే కాని పరిస్థితి సద్దుమణిగేలా లేదు.

 • Share this:
  ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి యుద్ధం మొదలైంది. మొన్నటి వరకు తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ భాయ్ భాయ్ అనుకున్నాయి. దోస్త్ మేరా దోస్త్ అంటూ కలిసి నిర్ణయాలు తీసుకున్నాయి.. రెండు రాష్టాల్లో ప్రభుత్వాల మద్య అవగాహన అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ అన్నట్టు వ్యవహారం ముదురుతోంది. మొన్నటి వరకు సఖ్యతగా ఉన్నట్టు కనిపించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇటు తెలంగాణ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటే అటు ఏపీ నుంచి వైసీపీ మంత్రులు, నేతలు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. మొన్న వేములు ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రస్తుతం రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ నెలకొంది. ఆ వేడి చల్లారక ముందే ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నీటి పంచాయితీలతో మళ్లీ గొడవలు వద్దని హితవు పలికారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామన్నారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామన్నారు. అపెక్స్‌ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు.

  మొదట సాఫ్ట్ గానే మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్ తరువాత స్వరం పెంచారు. తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్సార్‌ను దొంగ అనక ఏమంటారు? అని ప్రశ్నించారు. జగన్‌ కూడా అలాగే నీటిని దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. సయోధ్యతో ఉందామనుకుంటే.. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. అలాగే పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ.. అక్కడి విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నాయన్నారు. తెలంగాణ మొత్తం మీరే ఇచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారు. తెలంగాణ అధికారులను ఏపీలో ఇబ్బందులకు గురిచేశారని.. అలాగే నీటిపై సీపీఐ నారాయణ స్పష్టమైన వైఖరి చెప్పాలి అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.

  ఇదీ చదవండి: జగన్ సర్కార్ కు మరో షాక్.. చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతాం.. ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక

  కొన్ని రోజుల ముందు ఇదే అంశంపై మరో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాటి సీఎం వైఎస్ఆర్ నీటి దొంగ అయితే.. నేటి సీఎం జగన్ గజ దొంగ అంటూ మండిపడ్డారు. దీంతో వైసీపీ నేతలంతా టీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్లు  ఇచ్చారు.  ఈ ఇష్యూపై ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా సైతం ఘాటుగా స్పందించారు.  ఏపీ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని, దుర్మార్గం అని రోజా మండిపడ్డారు. కలిసి మెలిసి ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు రేపేలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదన్నారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. కేటాయింపులు లేకుండా చుక్క నీటిని కూడా వాడుకోవడం లేదని పేర్కొన్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులను ఆపాలని, అక్రమ ప్రాజెక్టులనీ మాట్లాడటం సరికాదన్నారు.
  Published by:Nagesh Paina
  First published: