BRS AP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇప్పటికే రాజకీయం వేడి వేడిగా సాగుతోంది. ప్రధానంగా వైసీపీ (YCP), టీడీపీ (TDP), జనసేన (Janasena) మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఆయ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పీక్ కు చేరాయి.. ఇప్పుడు ఈ మూడు పార్టీలతో పాటు మరొక పార్టీ హడావుడి చేసేందుకు సిద్ధమైంది. అదే కేసీఆర్ (KCR) సారథ్యంలో ఉన్న బీఆర్ఎస్ (BRS).. తాజాగా తిరుమల (Tirumala) వెంకన్నస్వామి దర్శనానికి వచ్చిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీలు ఏపీకి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసాయని.. స్థానిక పార్టీలు బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి తప్ప.. విభజన హామీలను అమలు చేయాలి అంటూ గట్టిగా అడగలేపోతున్న పార్టీలు ఏపీలో ఉన్నాయన్నారు.. కానీ ఆ హామీలను పూర్తి చేయగల సామర్థ్యం కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉంది అన్నారు మంత్రి..
ప్రస్తుతం ఏపీ ప్రజలు అత్యధికంగా రెండు విషయాలు కోరుకుంటున్నారని.. అందులో ఒకటి ఏపీకి ప్రత్యేక హోదా కాగా.. రెండోది పోలవరం ప్రాజెక్టు.. ఆ రెండు హామీలను పూర్తి చేయగల సామర్థ్యం కేవలం కేసీఆర్ కుమాత్రమే ఉంది అన్నారు. ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఇక్కడ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయింది అన్నారు. అందకే ఎక్కరువమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆసక్తిగా చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజల నుంచి ఇప్పటికే తమకు ఆహ్వానాలు అందుతున్నాయి అన్నారు. వారి అభిమానం చూస్తుంటే కచ్చితంగా బీఆర్ఎస్ కు ఏపీలో ఆదరణ పెరుగుతుందనే నమ్మకం పెరిగింది అన్నారు.
ఇదీ చదవండి : పార్టీ అధినేత కాదు యముడు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
అలాగే 2024 ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు తమపై నమ్మకం ఉంచి గెలిపిస్తే.. కాళేశ్వరం మాదిరిగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. అలాగే రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రత్యేక హోదా రాలేదని తెలిపారు. దాన్ని సాధించగల సత్తా కేవలం కేసీఆర్ కుమాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఏపీలో తమ పార్టీ సక్సెస్ అవుతుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, BRS, CM KCR, Malla Reddy