news18-telugu
Updated: October 30, 2019, 7:52 PM IST
రాజ్‌నాథ్‌తో కేటీఆర్ భేటీ
తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. హైదరాబాద్ - నాగ్‌పూర్, హైదరాబాద్ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. NH-44, NH-1పై రోడ్ల విస్తరణ, స్కైవేస్ కన్స్ట్రక్షన్ కోసం 39.40 ఎకరాల రక్షణ శాఖ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న రహదారులతో ట్రాఫిక్ సమస్యలతో పాటు ఆ రోడ్లు రవాణా అవసరాలకు సరిపోవడం లేదని వివరించారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే రహదారులను విస్తరించి, స్కైవేస్ నిర్మాణాలు చేపడతామని చెప్పారు కేటీఆర్.
తద్వారా కంటోన్మెట్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని, సరుకు రవాణా పెరిగి రాష్ట్రం అర్థికాభివృద్థి జరుగుతుందని తెలిపారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ను కోరారు కేటీఆర్. రాజ్‌నాథ్‌తో భేటీకి సంబంధించి ఫొటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు కేటీఆర్.
Published by:
Shiva Kumar Addula
First published:
October 30, 2019, 7:52 PM IST