Ys Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) కి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ వివేకా హత్య కేసులో తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని హైకోర్టును అవినాష్ ఆశ్రయించారు. తన విచారణ సందర్భంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలనీ..అలాగే న్యాయవాదిని అనుమతించాలని అవినాష్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) పై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించలేమని ఈ మేరకు హైకోర్టు పేర్కొంది.
అలాగే అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) ని అరెస్ట్ చేయొద్దని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అవినాష్ రెడ్డి పిటీషన్ ను తిరస్కరించింది. అలాగే కోర్టుకు సమ్పరించిన ఆధారాలన్నింటిని కూడా సీబీఐకి తిరిగి అప్పగించింది. ఇక అవినాష్ రెడ్డి తదుపరి సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని చెప్పిన కోర్టు..అతడిని సీబీఐ విచారించుకోవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అవినాష్ (Mp Avinash Reddy) విచారణ సమయంలో మాత్రం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా అవినాష్ రెడ్డి విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) కి షాక్ తగిలినట్లైంది.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి అలాగే అతని తండ్రి భాస్కర్ కు సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చింది. అంతేకాదు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy)ని సీబీఐ పలుమార్లు విచారించి మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో సీబీఐ (CBI) విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ సందర్బంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐకి (CBI) ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి రిట్ పిటీషన్ దాఖలు చేశారు. అలాగే న్యాయవాది సమక్షంలోనే సీబీఐ విచారణ జరిగేలా చూడాలని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు తనకు 150 సీఆర్పీసీ కింద సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చిందని..ఈ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని కోర్టు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు సమర్పించిన పిటీషన్ లో అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) పేర్కొన్నారు.
ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు తీర్పును ఇటీవల రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో నేడు తాజాగా తీర్పు వెలువరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Highcourt, YS Avinash Reddy, Ys viveka murder case