Godavari Boat | గోదావరి బోటు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

బోటు ప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి కన్నబాబుకు కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. వీలైనంత సాయం చేయాల్సిందిగా కోరారు.

news18-telugu
Updated: September 15, 2019, 7:35 PM IST
Godavari Boat | గోదావరి బోటు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 15, 2019, 7:35 PM IST
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో లాంచీ ప్రమాదం మరణంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. పడవ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. వెంటనే సహాయకచర్యల్లో పాల్గొనాల్సిందిగా మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆదేశించారు. ‘తూర్పు గోదావరి జిల్లాలోని పాపికొండలు వద్ద లాంచీ ప్రమాదం జరగడం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు ఉండటంతో అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.’ అని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.  మరోవైపు బోటు ప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి కన్నబాబుకు కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. వీలైనంత సాయం చేయాల్సిందిగా కోరారు. దీంతోపాటు హుటాహుటిన వెళ్లి మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, అంత్య క్రియలు, ఇతరత్రా కార్యక్రమాలలోనూ పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ను సీఎం కేసీఆర్ కోరారు.

ప్రమాదం జరిగిన బోటులో తెలంగాణకు చెందిన పర్యాటకులు కూడా చాలా మందే ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన 12 మంది, వరంగల్‌కు చెందిన 14 మంది ఉన్నట్టు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు పడవ మునిగిన ప్రమాదం నుంచి ఐదుగురు వరంగల్ వాసులు బయటపడ్డామని 9 మంది ఆచూకీ గల్లంతైనట్టు ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...