ఏపీలో తెలంగాణ గవర్నర్... తిరుమల స్వామిసేవలో తమిళిసై
శ్రీవారి భక్తురాలినని.. స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తమిళిసై.
news18-telugu
Updated: October 23, 2019, 11:44 AM IST

తిరుమల స్వామివారి సేవలో తెలంగాణ గవర్నర్
- News18 Telugu
- Last Updated: October 23, 2019, 11:44 AM IST
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు టీటీడీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత వరాహస్వామిని దర్శించుకున్న తమిళిసై ఆతర్వాత స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయం వెలుపలకు చేరుకున్న గవర్నర్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి భక్తురాలినని.. స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తమిళిసై. తిరుమలలో వసతి సదుపాయాలు, నిర్వాహణ బాగుందని కితాబిచ్చారు.
Loading...