Home /News /andhra-pradesh /

TELANGANA GOSHA MAHAL MLA AND BJP LEADER RAJA SINGH CRITICIZED ANDHRA PRADESH CM YS JAGAN PRV

AP CM Jagan: ఏపీ సీఎం జగన్​పై తెలంగాణ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ (AP CM YS Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు.

    తెలంగాణలోని గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ (BJP MLA Raja singh) ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ (AP CM YS Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. బాయ్ కాట్ తిరుపతి (Tirupati) అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతుందని రాజాసింగ్​ ధ్వజమెత్తారు. అలిపిరి వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తుందని ఈ  సందర్భంగా రాజాసింగ్​ విమర్శించారు. తిరుపతిలో శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద వివాదంగా మారిందని అన్నారు. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయికాట్ తిరుపతి అనేది వైరల్ అవుతుందని చెప్పారు రాజాసింగ్​. జగన్ తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణమని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. సీఎం జగన్ (AP CM Jagan) ఏ దేవుడిని నమ్ముతాడో దేశ ప్రజలు అందరికి తెలుసుని రాజా సింగ్ అన్నారు.

    అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు, తిరుపతికి జగన్ తీరుతో చెడ్డ పేరు వస్తుందని రాజాసింగ్ (BJP MLA Raja singh)​ విమర్శించారు. సుప్రీంకోర్టులో సమర్థవంతమైన న్యాయవాదిని ఉంచడం ద్వారా హిందూ మనోభావాలను నిలబెట్టే చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని రాజాసింగ్​ అన్నారు.



    గతంలో శ్రీశైలం..

    ఇటీవల శ్రీశైలం విషయంలో కర్నూలు ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. శ్రీశైల ఆలయంలో ముస్లింల పెత్తన పెరిగిపోయిందని రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం దేవస్థాన పరిధిలోని షాపులను ముస్లింలకే కేటాయించారని.. వైసీపీ నేత రజాక్ ఆగడాలు పెరిగిపోయాయని విమర్శలు చేశారు. అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు కాంట్రాక్టర్ల జాబితాను ఆయన బయట పెట్టారు. ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి అండతోనే రజాక్ చెలరేగిపోతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు అక్కడ గోశాలను కూడా రజాక్ భార్య నిర్వహిస్తోందని.. వందల ఆవులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సుప్రీంలో సమర్థవంతమైన న్యాయవాదిని నిమగ్నం చేయడం ద్వారా హిందూ మనోభావాలను నిలబెట్టే చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. హిందూయేతర దుకాణాల యజమానులు, వ్యాపారవేత్తలు మాంసం వినియోగానికి సంబంధించి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నారని రాజా సింగ్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జిఒ నెం.426 ద్వారా శ్రీశైలంలో ఇతర మతాలకు చెందిన వ్యాపారవేత్తలను నిషేధించిందని.. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గోశాల పర్యవేక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న రజాక్ భార్య సాయికుమారిపై అధికారులు బదిలీ వేటువేశారు. ఆమెను మరో విభాగానికి బదిలీ చేశారు. అంతేకాదు శ్రీశైలంం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న తొమ్మిది మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విభాగానికి చెందిన సిబ్బందిని బదిలీ చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ap cm jagan, Maharashtra, Raja Singh, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు