ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న నీటి వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

news18-telugu
Updated: August 5, 2020, 1:51 PM IST
ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న నీటి వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్
కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)
  • Share this:
ఏపీలోని జగన్ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సమైక్య రాష్ట్రంలోనే నదుల నీటివాటాలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని తన పిటిషన్‌లో పేర్కొంది. బచావత్ ట్రిబ్యునల్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ప్రస్తావించింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు, టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తూ తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించింది. ఈ ఫైలింగ్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

Rayalaseema, rayalaseema lift irrigation, telangana against Rayalaseema lift irrigation scheme, petition against Rayalaseema lift irrigation scheme in supreme court, ap news, telangana news, ap vs telangana on rayalaseema lift irrigation scheme, రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అభ్యంతరం, సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం పిటిషన్, తెలంగాణ న్యూస్, ఏపీ న్యూస్
పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్


రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ... ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆగస్టు 5న ఈ భేటీ ఏర్పాటు చేయాలని భావించింది. అయితే ఈ నెల 20 తరువాత ఈ భేటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో ఈ భేటీ వాయిదా పడింది. అయితే ఏపీ ప్రభుత్వానికి మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ ఈ భేటీ వాయిదా వేయించారని... ఆ లోపే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తుందని తెలంగాణలోని విపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Published by: Kishore Akkaladevi
First published: August 5, 2020, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading