ఏపీ, తెలంగాణ జలవివాదం... తెలివిగా ప్రధాని మోదీని లాగిన కేసీఆర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జలవివాదంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లాగారు తెలంగాణ సీఎం కేసీఆర్.

news18-telugu
Updated: June 5, 2020, 3:26 PM IST
ఏపీ, తెలంగాణ జలవివాదం... తెలివిగా ప్రధాని మోదీని లాగిన కేసీఆర్
ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జలవివాదంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లాగారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జల జగడంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం జరిగింది. అందులో కృష్ణా నది మీద తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రాజెక్టులు కడుతోందంటూ ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రాజెక్టులు, ఏపీ గురించి తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రాజెక్టుల మీద చర్చ జరిగింది. ఏపీ నుంచి స్పెషల్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నుంచి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తరఫున ప్రాజెక్టుల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో రజత్ కుమార్ పాత వీడియోను ప్లే చేశారు. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా తాత్సారం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అంటే, ఓ రకంగా ప్రధాని మోదీ కూడా అది చాలా పాత ప్రాజెక్టు, కానీ, తెలంగాణ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేకపోతోందని మండిపడ్డారు. బీజేపీ నేతగా ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నా కూడా అప్పటికి ఆయన ప్రధానమంత్రి. పీఎం స్థాయిలో ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టును లేవనెత్తి, దాన్ని పూర్తి చేయడం లేదని ఎందుకు ప్రస్తావిస్తారంటూ ఓ లా పాయింట్ లాగారు రజత్ కుమార్. అయితే, దీనిపై ఏపీ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వ్యవహారాన్ని రాజకీయ మలుపు తిప్పారంటూ మండిపడ్డారు. దీంతో పాటు ఉమ్మడి ఏపీలో ఆదిత్యనాథ్ దాస్ ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న సమయంలో జారీ చేసిన జీవోలను కూడా రజత్ కుమార్ కృష్ణా బోర్డు ముందు ఉంచారు. దీంతో ఆదిత్యనాథ్ దాస్ ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొన్నట్టు తెలిసింది. అయితే, అసలు కృష్ణా బోర్డులో ఎలాంటి రాజీ కుదరకుండానే భేటీ ముగిసింది. కృష్ణా నది మీద ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు డీపీఆర్‌ (డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు) సమర్పించాలని బోర్డు చైర్మన్ కోరగా, తమ ప్రభుత్వ అనుమతి తీసుకుని ఇస్తామంటూ అధికారులు దాట వేశారు. అంటే ఓ రకంగా అది అయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకుల వాదన.

First published: June 5, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading