Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్... అదేంటంటే...!

సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని రిలీవ్ చేసిన అనంతరం.. ఏర్పడిన ఖాళీలు.. ఇప్పటికే ఉన్న ఖాళీలను పరిశీలంచిన అనంతరమే ఈ ప్రక్రియ ముందుకెళ్తుందని నిపుణులు చెప్తున్నారు.

  • Share this:
    తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రకటన కేసీఆర్ నోటి వెంట వచ్చింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తమ సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలని చూస్తున్న ఏపీ ప్రాంత ఉద్యోగులకు సోమవారం కేసీఆర్ చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తన్న ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేస్తామని ప్రకటించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న ఈ తరహా ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన కసకత్తు కూడా పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తుండటంతో త్వరలోనే వారి కల నెరవేరనుంది. రాష్ట్ర విభజన సందర్భంగా క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులకు కేంద్రం ఆప్షన్స్ ఇవ్వకపోవడంతో ఏపీకి చెందిన వారు తెలంగాణలో.. తెలంగాణకు చెందిన వారు ఏపీలో ఉండిపోవాల్సి వచ్చింది.

    తాజాగా అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటనతో త్వరలోనే వారంతా ఏపీకి రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటైన కమిటీలు ప్రక్రియను కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా పనిచేస్తున్నవారు దాదాపు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంతో చర్చించిన అనంతరం వీరిని ఇక్కడికి పంపే అవకాశముంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని రిలీవ్ చేసిన అనంతరం.. ఏర్పడిన ఖాళీలు.. ఇప్పటికే ఉన్న ఖాళీలను పరిశీలంచిన అనంతరమే ఈ ప్రక్రియ ముందుకెళ్తుందని నిపుణులు చెప్తున్నారు.

    ఇది చదవండి: ఏపీలో ఆ మంత్రి అసంతృప్తికి కార‌ణ‌మిదేనా? అనుభవం ఉన్నా మాట నెగ్గడం లేదా..?



    మరోవైపు ఏపీలో ఉన్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను కూడా స్వరాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఏపీకి లేఖరాసింది. ఈ మేరకు తెలంగాణలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నవారిని రిలీవ్ చేయాలని లేఖలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ సొంత రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్న తెలంగాణ ప్రాంత మూడు, నాల్గో తరగతి ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారాలు చూస్తున్న ఎస్ఆర్ విభాగం ముఖ్య కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డికి... ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఈ లేఖ రాశారు.

    ఇది చదవండి: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒంటిపూట బడుల షెడ్యూల్ ఇదే..!


    తెలంగాణకు చెందిన ఏపీలో పనిచేస్తున్న దాపు 698 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించామని, రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్న ఉద్యోగులందరినీ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు రామకృష్ణారావు లేఖలే పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే రిలీవ్ చేయాలని తెలంగాణ స్పష్టం చేసింది.
    Published by:Purna Chandra
    First published: