హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KCR: కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ చేయడం లేదా ?.. ఆ మాటలకు అర్థమేంటి ?

KCR: కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్ చేయడం లేదా ?.. ఆ మాటలకు అర్థమేంటి ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

KCR AP: కేసీఆర్ ప్రకటనతో ఏపీలోని రాజకీయ పార్టీలకు కొంత ఊరట లభించినట్టు అయ్యిందని కొందరు భావిస్తుంటే.. వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఏపీ పేరు ప్రకటించలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR).. బీఆర్ఎస్‌తో దేశంలో మార్పు తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవిస్తోందని.. తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం పనిచేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తమ మొదటి కార్యక్షేత్రాలని ప్రకటించారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి బీఆర్ఎస్(BRS) జెండా ఎగురవేస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ ప్రకటనలో తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎదగాలంటే పలు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించాలి. కేసీఆర్‌కు ఏపీ తరువాత మంచి గుర్తింపు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందుంటుంది.

  అందుకే బీఆర్ఎస్‌ను ఏపీలో(Andhra Pradesh) విస్తరించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని.. ఇందుకోసం గతంలో తనతో పాటు టీడీపీలో పని చేసిన ఏపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. త్వరలోనే ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ అలా జరగలేదు. పైగా స్వయంగా సీఎం కేసీఆర్.. కర్ణాటక , మహారాష్ట్ర తమ మొదటి కార్యక్షేత్రాలని ప్రకటించి ఏపీపై తాము ఎక్కువగా ఫోకస్ చేయడం లేదని సంకేతాలు ఇచ్చినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  కేసీఆర్ ప్రకటనతో ఏపీలోని రాజకీయ పార్టీలకు కొంత ఊరట లభించినట్టు అయ్యిందని కొందరు భావిస్తుంటే.. వ్యూహాత్మకంగానే కేసీఆర్ ఏపీ పేరు ప్రకటించలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా ఏపీలో రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే.. ఏపీలోని రాజకీయ పార్టీలు కూడా అందుకు తగ్గట్టుగానే కౌంటర్ ఇస్తాయని.. గతంలో ఆయన ఏపీ విషయంలో అనుసరించిన విధానాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే కేసీఆర్‌కు ఏపీలో లాభం జరగకపోతే లేనిపోని కొత్త తలనొప్పులు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుందనే వాదన కూడా ఉంది.

  BRS: బీఆర్ఎస్‌గా టీఆర్ఎస్ .. ఎన్నికల కమిషన్‌కు తీర్మానం.. ఎన్ని రోజులు పడుతుందంటే..

  Telangana Politics: కేసీఆర్ ఫస్ట్ టార్గెట్ ఆ రాష్ట్రమే..వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ

  ఈ కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొత్త జాతీయ పార్టీ విస్తరణ కోసం కర్ణాటక, మహారాష్ట్రను ఎంచుకున్నారని.. ఈ రెండు ప్రాంతాల్లో తాను ఆశించిన విధంగా పార్టీ విస్తరిస్తే.. ఆ తరువాత ఏపీలో కూడా అనుకున్నట్టుగా జరిగేందుకు అవకాశం లభిస్తుందని కేసీఆర్ ఆలోచించి ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొత్త జాతీయ పార్టీ విస్తరణలో ఏపీ పేరు ప్రస్తావించకపోవడంపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, CM KCR, Telangana

  ఉత్తమ కథలు