హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KCR Target: ఏపీ టీడీపీ నేతలపై కేసీఆర్ ఫోకస్.. ఆయన జాబితాలో ఉన్నది ఎవరు?

KCR Target: ఏపీ టీడీపీ నేతలపై కేసీఆర్ ఫోకస్.. ఆయన జాబితాలో ఉన్నది ఎవరు?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

CM KCR: జాతీయ పార్టీ ప్రకటనలో దూకుడు పెంచుతున్నారు సీఎం తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇందులో భాగంగా ఆయన సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అలాగే ఏపీ లో కీలక నేతలపై ఆయన ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ నేతలను టార్గెట్ చేశారని చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  KCR Targets AP TDP: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telagana CM KCR) ఆరాటపడుతున్నారు. బీజీపీ (BJP) నీ ఢీ కొట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కీలక నేతలపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఏపీలో టీడీపీ (TDP) ని టార్గెట్ చేశారా? గతంలో తనతో పని చేసిన టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం (Vizianagaram), కడప (Kadapa) జిల్లాలపై కేసీఆర్ స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరాలంటూ ఏపీ టీడీపీ నేతలకు కేసీఆర్ నుంచి కబురు వెళ్లినట్లుగా సమాచారం. గత లోక్ సభ ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేసి ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న నేతలతో మంతనాలు కూడా సాగుతున్నట్లుగా సమాచారం.

  తాజాగా ఈ విషయాలన్నీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో చిట్ చాట్ లో వెల్లడించారు. అటు ఇప్పటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అటు ఏపీని టార్గెట్ చేసి మంత్రి హరీశ్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

  తాజాగా మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నుంచి రానున్న కొత్త జాతీయ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోందన్న సంకేతాలు ఇస్తున్న తరుణంలో.. మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ నేతలను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారని మంత్రి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మూడు జిల్లాలపై (శ్రీకాకుళం, విజయనగరం , కడప) కేసీఆర్ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు మంత్రి చెప్పారు.

  ఇదీ చదవండి : జగన్ ప్రత్యక్ష దైవం అంటున్న హనీ కుటుంబం.. సీఎం కోటి మంజూరు చేయడంతో వైద్యం ప్రారంభం

  సీఎం కేసీఆర్ కొత్త పార్టీ కోసం ఏపీ టీడీపీ నేతలను గాలం వేస్తున్నట్లుగా ఆయన ప్రస్తావించారు. గతంలో తనతో కలిసి పని చేసిన నేతలను బీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ చేరికల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం జాతీయ పార్టీ ఏర్పాటు వైపుగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. తాను స్థాపించబోయే జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున (అక్టోబర్ 5) టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, CM KCR, KCR New Party

  ఉత్తమ కథలు