Home /News /andhra-pradesh /

TEACHERS INVOLVED IN PHYSICAL ASSAULT IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH PRN

Andhra Pradesh: ప్రభుత్వ బడిలో కలకలం.., స్టూడెంట్స్ ముందే రెచ్చిపోయిన టీచర్లు..!

అప్పికట్ల జిల్లా పరిషత్ హైస్కూల్

అప్పికట్ల జిల్లా పరిషత్ హైస్కూల్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), గుంటూరు జిల్లా(Guntur District) లో పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు దారి తప్పారు. ఈర్ష్యా అసూయలతో పిల్లల ముందే గీతదాటి ప్రవర్తించారు.

    బడి అంటే చదువులు నేర్పే గుడి. పిల్లలకు మంచి, చెడు, సభ్యత, సంస్కారం నేర్పేది అక్కడే. పాఠాల ద్వారా, ప్రవర్తన ద్వారా ఓర్పు, సహనం అంటే ఏంటో నేర్పేది కూడా పాఠశాలే. కానీ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే క్రమశిక్షణ తప్పారు. స్కూల్ గ్రౌండ్ లోనే ఫైటింగ్ కు దిగారు. వివరాల్లోకి వెళ్తే.., గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, అప్పికట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై స్కూల్లో పనిచేసే మరో ముగ్గురు టీచర్లు చితకబాదారు. అప్పికట్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ గా పనిచేస్తున్న వెంకటేష్.., సాయంత్రం సమయంలో ఎప్పటిలాగే విద్యార్థులను ఆడించేందుకు ప్లే గ్రౌండ్ కు తీసుకెళ్తున్నాడు. ఐతే తాము కూడా వచ్చి ఆడతామంటూ అక్కడి టీచర్లుగా పనిచేస్తున్న జయరావు, శివయ్య, బుల్లయ్య వచ్చారు.

    పిల్లలతో పటు టీచర్లు కూడా ప్లే గ్రౌండ కు రాగానే వారిని ఆడుకోవాలని చెప్పి.. పని ఉందంటూ హెచ్ఎం రూమ్ కు వెళ్లాడు. దీంతో తమను గ్రౌండ్ లో ఉంచి నువ్వు వెళ్తావా అంటూ బుల్లయ్య, జయరావు, శివయ్యలు.. వెంకటేష్ తో వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా అతనిపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న వెంకటేష్ వెంటనే హెచ్ఎంకు, డీఈవోకు ఫఫిర్యాదు చేశారు. ముగ్గురు టీచర్లు తనపై హత్యాయత్నం చేశారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డీఈవో దుర్గాభవాని.. ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

    అసలు కారణం ఇదేనా..?
    వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేష్ పై దాడివెనుక వేరే కారణాలున్నట్లు తెలుస్తోంది. స్కూల్లో తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదన్న అక్కసుతోనే దాడిచేసినట్లు సమాచారం. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా ఆ ఏర్పాట్లను వెంకటేష్ పర్యవేక్షించడమే కాకుండా కొన్ని కీలక విషయాల్లో తమను పట్టించుకోవడం లేదన్న కోపంతోనే ఇలా చేసినట్లు సహోపాధ్యాయులు చెప్తున్నారు. ఐతే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఈర్ష్య, అసూయలను మనసులో పెట్టుకొని తోటి టీచర్నే కొట్టడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. టీచర్లే ఇలా తన్నుకుంటుంటే ఇక పిల్లలకేం పాఠాలు చెప్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Schools, Guntur, Teacher misbehave

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు