ఏపీలో మధ్యాహ్నానికి స్కూల్ మూసేసి.. మాస్టారు రియల్ ఎస్టేల్ వ్యాపారం...

గత కొంతకాలంగా మధ్యాహ్నానికి స్కూల్ మూసేసి పిల్లలు ఇంటికి పంపిస్తున్నట్లు విచారణలో తేలడం తో జిల్లా విద్యాశాఖ అధికారి ఇద్దరు టీచర్లు శ్రీకాంత్, దేవాలను సస్పెండ్ చేశారు.

news18-telugu
Updated: February 26, 2020, 10:37 PM IST
ఏపీలో మధ్యాహ్నానికి స్కూల్ మూసేసి.. మాస్టారు రియల్ ఎస్టేల్ వ్యాపారం...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన మాస్టారు... పరీక్షల సీజన్ కాబట్టి అవసరమైతే కొంచెం ఎక్కువ సేపు స్కూల్లో ఉండి పిల్లలకు బోధించాలి. కానీ, ఆ మాస్టారు మాత్రం మధ్యాహ్నానికి స్కూల్ మూసేసి ఎంచక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఎస్ అమరవరం గ్రామంలో ఈ ఘటన వెలుగులోకివచ్చింది. అమరవరం గ్రామంలో ఉన్న పాఠశాలను మధ్యాహ్నానికి మూసేసి పిల్లలను ఇంటికి పంపించి వేస్తున్న ఇద్దరు టీచర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత కొంతకాలంగా మధ్యాహ్నానికి స్కూల్ మూసేసి పిల్లలు ఇంటికి పంపిస్తున్నట్లు విచారణలో తేలడం తో జిల్లా విద్యాశాఖ అధికారి ఇద్దరు టీచర్లు శ్రీకాంత్, దేవాలను సస్పెండ్ చేశారు. సాయంత్రం వరకు స్కూల్లో విధులు నిర్వహించాల్సి ఉండగా, ఉపాధ్యాయుడు శ్రీకాంత్ ముందే లాంగ్ బెల్ కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల అలసత్వంపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading