ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పీఆర్సీ (PRC Iissue) మంటలు చల్లారలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ వల్ల ఒరిగేదేమీ లేదని ఆరోపిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఎక్కడికక్కడ ఉద్యోగులను అడ్డుకోవడంతో పోలీసులు, ఉద్యోగులకు మధ్య తోపులాటలు జరిగాయి. ప్రభుత్వం తమను మోసం చేసిందని.. తప్పుడు లెక్కలతో జీతాలు తగ్గించిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. విజయవాడ,విశాఖపట్నం, కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరసన బాటపట్టాయి. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు తగ్గేది లేదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. చాలా చోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న సీఎస్ చెప్పిన మాటలు గత రెండు నెలలుగా చెప్తున్నారని.. సీఎం వద్ద కూడా అవే మాటలు చెప్పారన్నారు. జీతం డీఏల వల్ల పెరుగుతుంది కానీ ఫిట్మెంట, పే స్కేల్స్ వల్ల కాదన్నారు. ఐఆర్ 27% శాతం నుంచి 23 శాతానికి తగ్గించారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగ లేదుకనుక తాము అర్ధ చేసుకున్నామని.. కానీ HRA స్లాబ్స్ ని తగించవద్దని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు అదేమైన మాకు ఇక్కడ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. లెక్కలు చూపించడం వల్ల పెరుగుతుంది అని చెప్పడం వేరు ఎంత పెరగాలి ఎంత పెరిగింది అనేది చెప్పాలి డిమాండ్ చేశారు. ఈ PRC వల్ల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పోరాడతాయని వెంకట్రామి రెడ్డి స్పష్టం చేశారు.
ఇది చదవండి: ఆ నేతల మీటింగ్ తర్వాత పవన్ వ్యూహం మార్చారా..? అందుకే ఆ కామెంట్స్ చేశారా..?
ఓ వైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తుంటే.. ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ట్రెజరీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్ ప్రకారం జీతాల్లో మార్పులు చేయాలని పేర్కొంది. ఇదిలా ఉంటే సీఎఫ్ఎంఎస్ జీతాల చెల్లింపు కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేసింది.
ఇది చదవండి: టీడీపీలో లైంగిక వేధింపులు.. లోకేష్ పీఏపై సంచలన ఆరోపణలు.. చినబాబుకు ఇబ్బందేనా..?
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో ఉద్యోగ సంఘాలు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. అందుకు తగ్గట్లుగా నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన నోటీసు ఇవ్వాల్సి ఉండటంతో ఈనెల 21న సీఎస్ కు నోటీసు ఇచ్చే అవకాశాలున్నాయి. గురువారం ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఐక్య వేదిక నేతలు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి సచివాలయ ఉద్యోగుల సంఘం కూడా హాజరయ్యే అవకాశముంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.