టీడీపీ, వైసీపీ గొడవ.. కర్రలు, రాళ్లతో దాడి...

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పందిగుంటలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగింది.

news18-telugu
Updated: May 31, 2020, 3:41 PM IST
టీడీపీ, వైసీపీ గొడవ.. కర్రలు, రాళ్లతో దాడి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో 25 మందికి గాయాలు య్యాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పందిగుంటలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగింది. తాగునీటి బోరు విషయంలో వివాదం తలెత్తగా... కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ముగ్గురిని శ్రీకాకుళం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఘటనతో పందిగుంట గ్రామంలో పోలీస్‌ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
First published: May 31, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading