హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TDP: ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన తమ్ముళ్లు.. చంద్రబాబు రాకున్నా ముందడుగే..!

TDP: ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన తమ్ముళ్లు.. చంద్రబాబు రాకున్నా ముందడుగే..!

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్నందున టీడీపీ (TDP) తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్నందున టీడీపీ (TDP) తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తానంటూ చంద్రబాబు (Chandrababu Naidu) శపథం చేసి సభ నుంచి వెళ్లిపోగా.. అదే సమయంలో టీడీపీ కూడా సభ నుంచి వాకౌట్ చేసింది. ఐతే చంద్రబాబు నిర్ణయం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్ కు వస్తారా..? రారా అనేది రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఐతే శనివారం జరిగిన టీడీఎల్పీ మీటింగ్ లో ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. అధినేత చంద్రబాబు సభకు దూరంగా ఉంటుండగా.. పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు వస్తారని టీడీపీ ప్రకటించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

  టీడీఎల్పీ సమావేశంలో అసెంబ్లీకి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై తీవ్ర చర్చ జరిగింది. దీనిపై చంద్రబాబు సభ్యుల అభిప్రాయాలను కోరగా.. సమావేశాలకు వెళ్లాలని కొందరు.. వెళ్ల కూడదని కొందరు సలహాలిచ్చారు. సభకు వెళ్లకుండా పలు కార్యక్రమాలు చేపట్టాలని మరికొందరు సించారు. ఐతే అందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత సభకు వెళ్లాలని తీర్మానించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మితిమీరిన అప్పులు, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సభకు వెళ్తేనే మంచిదనే అభిప్రాయం మెజారిటీ సభ్యుల్లో వ్యక్తమైందట. అసెంబ్లీలో నిలదీయడం ద్వారా జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లినట్లుంటుందని చాలా మంది సూచిండం, చంద్రబాబు కూడా అందుకు సమ్మతించడంతో టీడీపీ అసెంబ్లీకి హాజరవుతున్నట్లు స్పష్టమైంది. గతంలో ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా.. ఆయన తరపున పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోరాడిందని చంద్రబాబు గుర్తుచేసినట్లు సమాచారం.

  ఇది  చదవండి: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..


  గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన సతీమణిని కించపరిచేలా మాట్లాడరంటూ వైసీపీపై ధ్వజమెత్తిన చంద్రబాబు... ఈ కౌరవ సభ మళ్లీ గౌరవ సభగా మారినప్పుడే అంటే తాను సీఎంగానే సభలో అడుగు పెడతానని శపథం చేసిన చంద్రబాబు వెళ్లిపోయారు. అంతేకాదు తన సతీమణిని దూషించారంటూ మీడియా ఎదుట బోరున విలపించారు. దీంతో చంద్రబాబు ప్రెస్ మీట్ సచలనంగా మారింది.

  ఇది చదవండి: రియల్ దృశ్యం సినిమా చూపించాడు.. రెండేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు.. ఈ క్రైమ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్..


  మరోవైపు చంద్రబాబు ఉంటేనే సభలో టీడీపీని ఓ ఆటాడుకుంటున్న వైసీపీ.. ఇప్పుడు అధినేత లేకుండా మిగిలిన ఎమ్మెల్యేలు వస్తుండటంతో అసలు విమర్శలను, ప్రశ్నలను లెక్కచేసే అవకాశమే లేదని.. ఈసారి అసెంబ్లీలో వార్ వన్ సైడే అనే టాక్ వినిపిస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, AP Budget 2022, TDP