గౌ. స్పీకర్ గారికి.. నాకు 9 రోజుల పెటర్నిటీ లీవ్ కావలెను.. టీడీపీ ఎంపీ లేఖ

rammohan naidu

జనవరి 29 నుంచి ప్రారంభం అయిన పార్లమెంట్ సమావేశాల్లో ఫిబ్రవరి 10వ తేదీ లోపు తనకు 9 రోజుల పితృత్వపు సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రామ్మోహన్ నాయుడు భార్య నిండు గర్భిణి. ఆమె వారం, పది రోజుల్లో ప్రసవించే అవకాశం ఉంది.

 • Share this:
  తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పెటర్నిటీ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు లేఖ రాశారు. జనవరి 29 నుంచి ప్రారంభం అయిన పార్లమెంట్ సమావేశాల్లో ఫిబ్రవరి 10వ తేదీ లోపు తనకు 9 రోజుల పితృత్వపు సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రామ్మోహన్ నాయుడు భార్య నిండు గర్భిణి. ఆమె వారం, పది రోజుల్లో ప్రసవించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆమె వద్ద ఉండడం అవసరం అని తాను భావిస్తున్నానని చెప్పిన రామ్మోహన్ నాయుడు అందుకు సెలవు కావాలంటూ లేఖ రాశారు. బడ్జెట్ సమావేశాలకు హాజరుకాలేకపోతున్నానని చెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం కరోనా భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో తాను బయట ప్రాంతాలు తిరిగి వస్తే పుట్టిన బిడ్డకు అనారోగ్యం సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి, తాను రాలేనని ఆ లేఖలో చెప్పారు. అదే సమయంలో పిల్లల బాధ్యత మొత్తం తల్లి ఒక్కరిదే కాదని, తాను కూడా సమానంగా పుట్టబోయే బిడ్డ బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అందుకే తనకు సెలవు కావాలని కోరారు.

  ఆంధ్రప్రదేశ్ కోసం, శ్రీకాకుళం ప్రజల కోసం, దేశం కోసం తాను ఎప్పుడూ ముందువరుసలో ఉంటానని, అవసరం అయిన ప్రతి సందర్భంలోనూ తన గళాన్ని లోక్‌సభలో వినిపించానని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. అయితే, అదే సమయంలో ఓ బాధ్యత కలిగిన భర్తగా ఈ సమయంలో తన భార్య, బిడ్డలతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పెటర్నిటీ లీవ్ కోసం స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖ


  సెలవు తీసుకుంటున్నాను కాబట్టి, పార్లమెంట్‌లో ఏం జరుగుతుందనే అంశాన్ని పూర్తిగా వదిలివేయబోనని రామ్మోహన్ నాయుడు చెప్పారు. పార్లమెంట్‌కు హాజరుకాలేకపోయినప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన తాను పార్లమెంట్‌కు హాజరవుతానని ఆ లేఖలో ఓం ప్రకాష్ బిర్లాకు రామ్మోహన్ నాయుడు వివరించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: