Home /News /andhra-pradesh /

TDP SET UP CONTROL ROOMS FOR AP GRAM PANCHAYAT ELECTION IN ANDHRA PRADESH AK

Chandrababu Naidu: పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే..

టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబు  నాయుడు(ఫైల్ ఫోటో)

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లోనూ నామినేషన్లు వేయాలని నేతలకు సూచించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలని... రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడేవాళ్లకు బుద్ది చెప్పాలని చంద్రబాబు పేర్కొన్నారు.

    పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎటువంటి ఘర్షణలకు పాల్పడినా, ఆటంకాలు సృష్టించినా రాజధాని అమరావతిలో టిడిపి కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఇందుకోసం 24గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ను ఇప్పటికే ఏర్పాటు చేశామని అన్నారు. కంట్రోల్ రూమ్ లో కాల్ సెంటర్ నెంబర్ 7306299999కు వెంటనే తెలియజేయాలని.. . ఫోటో, వీడియో సాక్ష్యాధారాలను వాట్సప్ నెంబర్ 7557557744కు పంపాలి. సలహాలు సూచనలు ఇచ్చేందుకు టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు అందుబాటులో ఉంటారని అన్నారు. అన్ని స్థానాల్లో నామినేషన్లు వేయాలని నేతలకు సూచించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలని... రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడేవాళ్లకు బుద్ది చెప్పాలని చంద్రబాబు పేర్కొన్నారు.

    తొలివిడత పంచాయితీ ఎన్నికల ప్రాంతాల టిడిపి నాయకులతో తెలుగుదేశం పార్టీ అధినేత గురువారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చరిత్రలో లేనంత అభివృద్ది రాష్ట్రంలో కేవలం ఐదేళ్లలోనే చేశామని చంద్రబాబు అన్నారు. వేలాది కిమీ సిమెంట్ రోడ్లు నిర్మించామని అన్నారు. గెలిస్తే మీ ఊరికి మీరేం చేస్తారో అభ్యర్ధులే వివరించాలని.. ప్రజలను మెప్పించి ప్రజాదరణ పొందాలని సూచించారు. వైసిపి బలవంతపు ఏకగ్రీవాలను, హింసా విధ్వంసాలపై జనం విసిగిపోయారని చంద్రబాబు అన్నారు. వైసిపి విధ్వంస కాండతో రాష్ట్రానికి ఎనలేని చెడ్డపేరు వచ్చిందని... అన్నివర్గాల ప్రజల్లో వైసిపిపై తీవ్ర అసంతృప్తి, ఉన్మాద చర్యలు, కోర్టుల చివాట్లు, విధ్వంసాలతో జనం విసిగిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

    ఇళ్లస్థలాల్లో భూసేకరణకు మీ ఊళ్లలో ఎంత స్కామ్ చేశారో జనం కళ్లముందే ఉందని... గ్రామాల్లో పట్టా భూములు, ఎండోమెంట్ భూములు 6రకాల ప్రభుత్వ భూములు కాపాడాలంటే, ల్యాండ్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వైసిపిని ఓడించాలని అన్నారు. పేదల స్కీముల్లోనూ స్కామ్ లు చేసిన వైసీపీకి బుద్ది చెప్పాలని...టిడిపి తెచ్చిన సంక్షేమ పథకాలు రద్దుచేసినందుకు గుణపాఠం చెప్పాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Gram Panchayat Elections, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు