హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ అవ్వాల్సిన సమయం వచ్చేసిందా? టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు సీనియర్ల డిమాండ్

Andhra Pradesh: జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ అవ్వాల్సిన సమయం వచ్చేసిందా? టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు సీనియర్ల డిమాండ్

కానీ అందులో ఎలాంటి నిజం లేదు.. ఎన్టీఆర్‌కు వైరస్ ఎలా సోకిందో అర్థం కావడం లేదని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైనా ఈయనకు కరోనా రావడంతో ట్రిపుల్ ఆర్ షూటింగ్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటంతో రెండు వారాల కంటే ఎక్కువ రోజులే హౌజ్ అరెస్ట్ కానున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

కానీ అందులో ఎలాంటి నిజం లేదు.. ఎన్టీఆర్‌కు వైరస్ ఎలా సోకిందో అర్థం కావడం లేదని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైనా ఈయనకు కరోనా రావడంతో ట్రిపుల్ ఆర్ షూటింగ్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటంతో రెండు వారాల కంటే ఎక్కువ రోజులే హౌజ్ అరెస్ట్ కానున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని టీడీపీ అధినేష్టానం పిలుపు ఇస్తే.. లీడర్లు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీకి జూనియర్ అవసరం ఉందంటున్నారు. ఎన్టీఆర్ సహా చాలామంది పార్టీ కోసం పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  టీడీపీ (telugu desam party)నీ కాపాడే నాథుడు ఎవరు? ప్రస్తుతం ఈ చర్చ ఆ పార్టీలోనే జోరుగా జరుగుతోంది. మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అంటున్నారు టీడీపీ (tdp)  సీనియర్ నేతలు. ఇప్పటికే కీలక నేతలు, పార్టీకి ఎప్పటినుంచో కొమ్ముకాస్తూ వస్తున్న కేడర్ చేజారిపోతుండడం పార్టీ అధిష్టానంలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే కీలక నేతలంతా వైసీపీ (ysrcp), బీజేపీ(bjp)ల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం చంద్రబాబు (chandra babu naidu) వెంట ఉన్న నేతలు ఎవరు అన్నది కూడా అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వేళ్ల పై లెక్కించేంత మంది చంద్రబాబుతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారని సీనియర్ నేతలు చెబుతున్న మాట.  పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నది కూడా చాలా తక్కువమందే ఉన్నారు.  టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతల్లోనూ మరికొందరు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం ఉంది. అందుకు ప్రధాన కారణం అధిష్టానం వ్యవహరిస్తున్న తీరే అంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని.. ఇలా ఉంటే పార్టీకి భవిష్యత్తు లేదని సీనియర్ నేతలు సైతం కార్యకర్తల సమావేశాల్లో మండిపడుతున్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల తరువాత నేతల్లో చాలామంది స్వరం మారింది. దాదాపు చాలా జిల్లాల్లో బలమైన కేడర్ రోజు రోజుకూ చేజారిపోతోంది.

  ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటీడీపీ (tdp) ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. తెలుగు నేలపై ప్రభంజనం సృష్టించి అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీనీ ఎన్టీఆర్ స్థాపించి నేటికి 40 ఏళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు రాష్టాల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ ఎక్కడా పార్టీ కేడర్ లో మాత్రం జోష్ కనిపించడం లేదు. ఏదో తూతూ మంత్రంలా ఈ వేడుకలను కానిచ్చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ పెద్దలపై కేడర్ నమ్మకం సన్నగిల్లుతోంది. ఇప్పటికే కొందరు దీనిపై బహిరంగంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు కూడా.

  ఓ వైపు పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉంటే.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ (jr NTR) నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా.. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. దీన్నిపై ఎన్టీఆర్ సీరియస్ అవుతున్నా.. అభిమానుల నుంచి డిమాండ్ ఆగడం లేదు.. ఇంకాస్త పెరుగుతూ వస్తోంది. చిన్న నేతలు, కేడర్ మాత్రమే కాదు.. టీడీపీ సీనియర్లు సైతం ఎన్టీఆర్ యాక్టివ్ అవ్వాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.

  త్వరలోనే తెలుగుదేశం పార్టీలో భారీగా మార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gotantla buchaiah chowdary) అన్నారు. రాజమండ్రిలో జరిగిన టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. అన్ని హార్డిళ్లను దాటుకుని పార్టీ విజయపరంపర కొనసాగించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితుల బట్టి పార్టీలో కొత్త నాయకత్వం రాబోతుందని జోస్యం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌.. పార్టీ శ్రేయోభిలాషలతో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Jr ntr, TDP

  ఉత్తమ కథలు