Home /News /andhra-pradesh /

AP ESI SCAM: ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు ?

AP ESI SCAM: ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు ?

అచ్చెన్నాయుడు (ఫైల్ ఫోటో)

అచ్చెన్నాయుడు (ఫైల్ ఫోటో)

ఏపీ ఈఎస్‌ఐలో గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు

    ఏపీలో వెలుగు చూసిన ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందనే వార్తలు జోరందుకున్నాయి. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని... నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని రిపోర్ట్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది.

    ఈఎస్‌ఐలో గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ. 51 కోట్ల చెల్లించిన తేలింది. ఈ మొత్తం వ్యవహారానికి ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్, విజయ్‌ను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే...136 శాతం అధికారంగా సంస్థలు టెండర్లలో చూపించాయి. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు డైరెక్టర్లు అక్రమంగా రూ. 85 కోట్లు చెల్లించినట్టు రిపోర్టులో ప్రస్తావించారు. స్కామ్‌లో ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు సహకరించారని పేర్కొన్నరు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Esi scam, Kinjarapu Atchannaidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు