TDP-Janasena Friendship 2024 Elections: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రస్తుతం రాజకీయలు (Politics) పరిణామాలు చూస్తుంటే పొత్తులు.. సమీకరణాలు మారే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం మిత్రులుగా ఉన్న బీజేపీ-జనసేన (Bjp-janasena)మధ్య బంధం బీటలు వారి.. టీడీపీ-జనసేన (Tdp-Janasena)మధ్య కొత్త పొత్తులు చిగురించే సూచనలున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్టుగానే పరిణామాలు ఉంటున్నాయి. టీడీపీ విషయంలో సాఫ్ట్‌గా మాట్లాడ్డం.. ప్రధానంగా కమ్మ సామాజికవర్గాన్ని వెనకేసుకురావడం వంటివి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)వైపునుంచి జరిగితే.. ఇటీవల వైసీపీ వర్సెస్ జనసేన (YCP Vs Janasena)ఎపిసోడ్‌లో టీడీపీ పవన్ కల్యాణ్‌కు అండగా నిలిచింది. ఇదే సమయంలో టీడీపీలో మరో చర్చ జరుగుతోంది. జనసేనకు ఈ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అని చాలామంది నేతలు అంతర్గత సమావేశాలు.. పిచ్చాపాటిగా భేటీలలో ప్రశ్నిస్తున్నారట. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేసింది. ఆందోళనా కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విషయంలో మంత్రి పేర్ని నాని (Minster Perni Nani) ఏ విధంగా అయితే టార్గెట్ చేసి దుమ్ము దులిపేశారో.. చంద్రబాబు (Chandra Babu), లోకేష్ (Lokesh)లను కూడా మంత్రి కొడాలి నాని (Minster Kodali nani), ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabaneni Vamsi)వంటి వారు అదేవిధంగా టార్గెట్ చేశారు. పొలిటికల్ ఫ్లాట్‌ఫాం దాటి వెళ్లాయి ఆ విమర్శలు. వివిధ సందర్బాల్లో టీడీపీ చేసే కార్యక్రమాలను అధికార పార్టీ అడ్డుకోవడం.. బాధితులను పరామర్శించడానికి కూడా అనుమతివ్వకపోవడం.. చంద్రబాబు.. లోకేష్‌లను అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించడం వంటి సంఘటనలు చాలా జరిగాయని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఏ ఒక్కరోజైనా పవన్ కల్యాణ్ కానీ.. ఆ పార్టీలో చెప్పుకోదగ్గ లీడరుగా ఉన్న నాదెండ్ల మనోహర్ (Nadenda Manohar) కానీ స్పందించారా..? మనకు మద్దతు ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారట.
టీడీపీకి అండగా ఉన్న సామాజికవర్గాలకు పవన్ గురి..
ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ విషయంలో అంతలా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు. పైగా పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన ప్రసంగాలను లోతుగా విశ్లేషిస్తే.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నట్టు కన్పించినా.. తెలుగుదేశానికి అండగా ఉండే వివిధ సామాజికవర్గాలను.. సంప్రదాయ ఓట్లను లక్ష్యం చేసుకున్నట్టుగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే లాభమనే లెక్కలు వేసుకునే బదులు నష్టం జరుగుతుందా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కొందరు వాధిస్తున్నారు.
ఇటీవల మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు కొందరు నేతలు. చంద్రబాబు, లోకేష్ నిర్వహించే కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకున్న ప్రభుత్వం.. పోలీసులు.. పవన్ కల్యాణ్‌ను ఎందుకు అడ్డుకోవడం లేదనే రీతిలో ఆలోచన చేస్తే అన్నిరకాల ప్రశ్నలకు సమాధానం లభిస్తుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు పలువురపు సీనియర్లు. జనసేన బలం పెరిగిందా.. లేదా..? అనే విషయాన్ని పక్కన పెట్టి.. టీడీపీ బలం ఎంత వరకు పెరిగిందనే రీతిలో ఆలోచన చేస్తే పార్టీ గాడిన పడుతోందనే చర్చ తెలుగుదేశంవర్గాల్లో జోరుగా సాగుతోందట. మరి.. అధినేత వేటికి ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Bjp-janasena, Chandrababu Naidu, Janasena, TDP