కొలిక్కి వచ్చిన టీడీపీ మేనిఫెస్టో... వైసీపీకి షాకిచ్చేలా ఉందా?

TDP Manifesto : పార్టీల గెలుపోటముల్ని నిర్దేశించే వాటిలో మేనిఫెస్టో కీలకమైనది. మరి టీడీపీ మేనిఫెస్టో ఎలా ఉంది?

Krishna Kumar N | news18-telugu
Updated: March 24, 2019, 10:08 AM IST
కొలిక్కి వచ్చిన టీడీపీ మేనిఫెస్టో... వైసీపీకి షాకిచ్చేలా ఉందా?
చంద్రబాబు (File)
  • Share this:
ఇదివరకు మేనిఫెస్టోని పార్టీలూ పట్టించుకునేవి కాదు... ప్రజలూ పట్టించుకునేవాళ్లు కాదు. పార్టీలు... కులాలు, మతాల ఆధారంగా అధికారంలోకి వచ్చేసేవి. అందువల్ల అవి మేనిఫెస్టోని తేలిగ్గా తీసుకునేవి. మనం కూడా ఫీలయ్యేవాళ్లం కాదు. ఎందుకంటే... వాళ్లు మేనిఫెస్టోలో ఏవేవో చెబుతారు... అమలు మాత్రం చెయ్యరు... దాన్ని చదవడం కూడా టైం వేస్ట్ అనుకునేవాళ్లం. ఇప్పుడు సీన్ మారింది. ముఖ్యంగా ఏపీలో ఏ పార్టీ అయినా అల్లటప్పాగా మేనిఫెస్టో తయారుచేస్తే ప్రత్యర్థి పార్టీలు ఊరుకునేలా లేవు. ఉదాహరణకు టీడీపీ తాను తెచ్చే మేనిఫెస్టోలో అన్ని అంశాల్నీ అమలు పరచాల్సిందే. మాట మార్చితే వైసీపీ ఊరుకునేలా లేదు. అలాగే వైసీపీ మేనిఫెస్టోలో అంశాల్ని అమలు పరచకపోతే, టీడీపీ సహించేలా లేదు. అందువల్ల ఈ రెండు పార్టీలూ అత్యంత జాగ్రత్తగా మేనిఫెస్టో రచిస్తున్నాయి. మరి వచ్చే ఐదేళ్లలో టీడీపీ ఏం చెయ్యాలనుకుంటుందో, మేనిఫెస్టోలో ఏం చెప్పబోతుందో ఫటాఫట్ తెలుసుకుందాం.

మేనిఫెస్టోలో ఉండబోతున్న ముఖ్య హామీలు

* రైతులకు పగటి పూట 12 గంటల ఉచిత విద్యుత్
* అన్నదాతా సుఖీభవ పథకం వచ్చే ఐదేళ్లూ పొడిగింపు
* 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
* స్వామినాథన్ కమిటీ సిఫార్సులు పూర్తిగా అమలు
* 2019 కల్లా పోలవరం పూర్తి. 40 లక్షల ఎకరాలకు నీరు* పంచనదుల అనుసంధానం ద్వారా ఏపీ కరవు రహిత రాష్ట్రం
* వృధ్యాప్య పెన్షన్ వయసు 65 నుంచి 55 సంవత్సరాలకు తగ్గింపు
* మహిళలకు పసుపు-కుంకుమ పథకం ప్రతి ఏటా కొనసాగింపు
* చంద్రన్న భీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పొడిగింపు
* ప్రతి కుటుంబానికీ నెలకు రూ.15వేలు వచ్చేలా చర్యలు
* రాష్ట్రవ్యాప్తంగా 1000 అన్న క్యాంటీన్ల ఏర్పాటు
* చంద్రన్న పెళ్లికానుక ద్వారా అన్నివర్గాలకూ లక్ష రూపాయలు
* బీసీ సబ్ ప్లాన్ చట్టానికి విధి విధానాలు రూపొందించి, అమలు
* కాపులకు ఈబీసీ కోటాలో ఆల్రెడీ 5 శాతం రిజర్వేషన్లు... రానున్న ఐదేళ్లలో 6 వేల కోట్లు కేటాయింపు
* రాజధానిలో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనంను 2020కి పూర్తి
* బాబు జగ్జీవన్ రామ్ స్మృతివనంను 24 నెలల్లో పూర్తి చేస్తాం
* ఎస్సీ... ఎస్టీ కమిషన్‌ను రెండుగా విభజింపు
* మాదిగలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు
* ఉర్దూను రెండో అధికార భాషగా పకడ్బందీగా అమలు
* దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి
* గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల మందికి ఇళ్లు
* ఐటీ రంగంలో రూ.65,000 కోట్ల పెట్టుబడులు... 2.5 లక్షల ఉద్యోగాల కల్పన
* ఐదేళ్ళలో 15 లక్షల మందికి ఉద్యోగాల కల్పన
* సేవ్ డెమోక్రసీ... సేవ్ కాన్స్‌టిట్యూషన్ (రాజ్యాంగం) పేరుతో జాతీయ విధానం

 

ఇవి కూడా చదవండి :

Pics : ఏడుస్తూ విసిగిస్తున్నాడని పిల్లాడి పెదవులపై గమ్ రాసిన తల్లి... తర్వాతేమైందంటే...


కాంగ్రెస్ పార్టీలో చేరిన హర్యానా డాన్సర్ సప్నా చౌదరి

కేంద్రమంత్రి ఉమాభారతికి బీజేపీలో అత్యున్నత పదవి 

ఏప్రిల్‌లో పీఎం కిసాన్ మనీ బదిలీ... 2 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
First published: March 24, 2019, 10:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading