ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సంధించే అస్త్రాలివే...

వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి మొత్తం 21 అంశాలను సమావేశాల్లో లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదల, అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పనులను ప్రభుత్వం నిలిపివేయడంపై సభలో గళమెత్తేందుకు సిద్ధమవుతోంది.

news18-telugu
Updated: December 8, 2019, 11:07 PM IST
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సంధించే అస్త్రాలివే...
ఏపీ సీఎం జగన్
  • Share this:
వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నిర్ణయించింది. వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి మొత్తం 21 అంశాలను సమావేశాల్లో లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదల, అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పనులను ప్రభుత్వం నిలిపివేయడంపై సభలో గళమెత్తేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా నదుల అనుసంధానంతో పాటు విభజన హామీల అమలు, మహిళలపై అత్యాచారాలు, దాడుల, తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, రైతు రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వంపై గళం విప్పనున్నారు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సంధించే అస్త్రాలివే...

ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదల

ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు

ఇసుక ధరల పెంపు

రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం

రాజధాని అమరావతి పనులు నిలిపివేతసంక్షేమ పథకాల్లో కోత విధింపు

గత ప్రభుత్వ పనులు నిలిపివేత, రద్దు

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు

పెట్టుబడులు వెనక్కి వెళ్లడం

బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల విక్రయాలు

రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం

ఉపాధి హామీ బిల్లుల పెండింగ్

ఇళ్ల నిర్మాణం నిలిపివేత

మీడియాపై ఆంక్షల జీవో

వలంటీర్ల నియామకంలో అక్రమాలు
Published by: Krishna Adithya
First published: December 8, 2019, 11:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading