బాబు దీక్షకు మద్దతుగా ఏపీలో ఆందోళనలు...మిన్నంటిన హోదా నినాదాలు

చంద్రబాబు దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

news18-telugu
Updated: February 11, 2019, 4:36 PM IST
బాబు దీక్షకు మద్దతుగా ఏపీలో ఆందోళనలు...మిన్నంటిన హోదా నినాదాలు
ట్రాక్టర్ ర్యాలీ
news18-telugu
Updated: February 11, 2019, 4:36 PM IST
ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష రాజకీయ సెగలు రేపుతోంది. రాహుల్, మన్మోహన్, కేజ్రీవాల్, శరద్‌పవార్, ఒమర్ అబ్దుల్లా, ములాయం సింగ్ యాదవ్ సహా పలు విపక్ష పార్టీల నేతలు దీక్షకు మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హోదా నినాదాతో ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రతిధ్వనిస్తోంటే.. ఇటు ఏపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. చంద్రబాబు దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు నేతృత్వంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. విభజన హామీలను అమలు చేయకుండా ఏపీకి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తోందని మండిపడ్డారు నేతలు.

chandrababu deeksha, Andhra Pradesh CM, Chandrababu Naidu, Deeksha in Delhi, Chandrababu Naidu's Delhi protest, Darma Porata Deeksha in Delhi, ap special category status,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు దీక్ష, ధర్మపోరాట దీక్ష, ఏపీ భవన్, ఢిల్లీ వేదికగా చంద్రబాబు దీక్ష, ప్రత్యేకహోదా
టీడీపీ నేతల ఆందోళన

సీఎం చంద్రబాబు ధర్మపోరాటదీక్షకు మద్దతుగా నరసరావుపేట పట్టణంలోని మున్సిపాల్ కార్యాలయం వద్ద అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దీక్షచేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు భారీగా పాల్గొన్నారు. రాష్ట్రంపై నరేంద్ర మోదీ పగబట్టారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.chandrababu deeksha, Andhra Pradesh CM, Chandrababu Naidu, Deeksha in Delhi, Chandrababu Naidu's Delhi protest, Darma Porata Deeksha in Delhi, ap special category status,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు దీక్ష, ధర్మపోరాట దీక్ష, ఏపీ భవన్, ఢిల్లీ వేదికగా చంద్రబాబు దీక్ష, ప్రత్యేకహోదా
టీడీపీ ధర్మపోరాట దీక్ష

ఢిల్లీ ఆంధ్రభవన్‌లో ధర్మపోరాట దీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబుకు మద్దతుగా వినుకొండ మున్సిపాలిటి వద్ద శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

chandrababu deeksha, Andhra Pradesh CM, Chandrababu Naidu, Deeksha in Delhi, Chandrababu Naidu's Delhi protest, Darma Porata Deeksha in Delhi, ap special category status,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు దీక్ష, ధర్మపోరాట దీక్ష, ఏపీ భవన్, ఢిల్లీ వేదికగా చంద్రబాబు దీక్ష, ప్రత్యేకహోదా
టీడీపీ నేతల ఆందోళన

మాచర్ల పట్టణంలో సీఎంకు మద్దతుగా టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నోటికి నల్లరిబ్బన్‌లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీకి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

chandrababu deeksha, Andhra Pradesh CM, Chandrababu Naidu, Deeksha in Delhi, Chandrababu Naidu's Delhi protest, Darma Porata Deeksha in Delhi, ap special category status,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు దీక్ష, ధర్మపోరాట దీక్ష, ఏపీ భవన్, ఢిల్లీ వేదికగా చంద్రబాబు దీక్ష, ప్రత్యేకహోదా
టీడీపీ ర్యాలీ
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...