ఏపీలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి మరో 10 రోజుల గడువు మాత్రమే ఉంది. తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ భారీ మెజార్టీతో గెలుచుకోవాలని వైసీసీ ప్లాన్ చేస్తుంటే.. ఇక్కడ జనసేనతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్న బీజేపీ సైతం తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించి ప్రచారం చేయించాలని నిర్ణయించింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా తిరుపతిలో తమ సత్తా చాటాలని వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే తిరుపతి లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పలువురు సీనియర్ నేతలను ఇంఛార్జ్‌లను నియమించిన చంద్రబాబు.. త్వరలోనే తాను కూడా ప్రచారంలోకి దిగనున్నారు.
ఈ నెల 8 నుండి చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. సత్యవేడు నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. ఉప ఎన్నికల్లో భాగంగా 8 రోజుల పాటు చంద్రబాబు.ప్రచారం చేయనున్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగసభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ పాల్గొంటున్నారు. వైసీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అధికార వైసీపీ చంద్రబాబును ఎక్కువగా విమర్శిస్తున్నా.. బీజేపీ, జనసేనను కూడా టార్గెట్ చేస్తోంది. మరోవైపు బీజేపీ సైతం వైసీపీతో పాటు చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీతో పాటు బీజేపీ, జనసేన కూటమిని కూడా టార్గెట్ చేస్తారా ? లేక కేవలం వైసీపీని విమర్శించడానికే పరిమితం అవుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.