కురిచేడు మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత.. మండిపడ్డ చంద్రబాబు

లిక్కర్ మాఫియా అరాచకాలపై కఠిన చర్యలు చేపట్టాలని... కురిచేడు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: July 31, 2020, 12:17 PM IST
కురిచేడు మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత.. మండిపడ్డ చంద్రబాబు
చంద్రబాబు
  • Share this:
ప్రకాశం జిల్లా కురిచేడులో 10 మంది దుర్మరణం చెందడంపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల ఈ విధమైన దుర్ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గత 14నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు పేట్రేగడం బాధాకరమని... నాటు సారా తాగి, కల్తీ మద్యం సేవించి, శానిటైజర్లు తాగి పలువురు చనిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ధరలు 300 శాతానికిపైగా పెంచేశారని... నాసిరకం బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా పెరిగిపోయిందని.. గడ్డివాముల్లో, మొక్కజొన్న మోపుల్లో, లారీల్లో ఎక్కడ చూసినా అక్రమ మద్యం నిల్వలే ఉన్నాయని విమర్శించారు. వైసిపి కార్యకర్తలే మొబైల్ బెల్ట్ షాపులుగా మారారని... వందలాది ద్విచక్ర వాహనాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో చూశామని అన్నారు. రాష్ట్రంలో నాటుసారా తయారీ యధేచ్చగా సాగుతోందని, సారా విక్రేతలదే రాజ్యంగా మారిందని సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ ధ్వజమెత్తారని అన్నారు. లిక్కర్ మాఫియా అరాచకాలపై కఠిన చర్యలు చేపట్టాలని... కురిచేడు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: July 31, 2020, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading