హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KCR-Chandrababu: కేసీఆర్ జాతీయ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్షన్ ఇదే..

KCR-Chandrababu: కేసీఆర్ జాతీయ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్షన్ ఇదే..

చంద్రబాబు, కేసీఆర్(పాత ఫొటో)

చంద్రబాబు, కేసీఆర్(పాత ఫొటో)

Chandrababu Naidu on BRS: దసరా సందర్భంగా విజయవాడలో సతీసమేతంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబునాయుడు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్( భారత్ రాష్ట్ర సమితి)గా మార్చారు. ఇందుకు సంబంధించి పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానంపై కేసీఆర్ (KCR) సంతకం చేశారు. ఇక ఈ తీర్మానాన్ని ఈసీకి ఆమోదముద్ర వేస్తే.. ఎన్నికల్లో కూడా పార్టీ పేరు మారనుంది. ఇదిలా ఉంటే కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా(BRS) మార్చి జాతీయ రాజకీయల్లోకి వెళతామని ప్రకటించడంపై అనేక రాజకీయ పార్టీలు సైలెంట్‌గా ఉన్నాయి. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఈ అంశంపై భిన్నంగా స్పందించారు. దసరా సందర్భంగా విజయవాడలో సతీసమేతంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబునాయుడు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

  ఈ సందర్భంగా కేసీఆర్ తన పార్టీ పేరును మార్చడం, ఆయన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం వంటి అంశాలను విలేఖరులు చంద్రబాబు ముందుకు ప్రస్తావించారు. అయితే చంద్రబాబు దీనిపై ఏమీ మాట్లాడలేదు. ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబు ఈ అంశంపై స్పందించకూడదని నిర్ణయించుకున్నారేమో అనే చర్చ జరుగుతోంది.

  తెలంగాణలో మరో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. 21 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ .. బీఆర్ఎస్‌గా మారింది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన ఈ తీర్మానంపై పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్(KCR) సంతకం చేశారు. దీంతో టీఆర్ఎస్(TRS) బీఆర్ఎస్‌గా(BRS) మారడానికి కావాల్సిన లాంఛనాలు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో చేసిన తీర్మానం కాపీతో పలువురు నేతలు ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. వాళ్లు రేపు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై చర్చిస్తారని.. పార్టీ చేసిన తీర్మానం కాపీని వారికి అందిస్తారని సమాచారం.

  2001లో టీఆర్ఎస్‌లో ఏర్పాటు చేసిన కేసీఆర్ .. 2014లో తెలంగాణ ఏర్పాటు తరువాత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కేంద్రంలో ఎన్డీయే, యూపీఏకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేశారు. కానీ కూటములతో తాము అనుకున్న మార్పు సాధ్యం కాదని అనుకున్న కేసీఆర్.. చివరికి సొంతంగా జాతీయస్థాయిలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని అనుకున్నారు.

  YS Sharmila: ఢిల్లీకి వైఎస్ షర్మిల.. కేంద్ర పెద్దలను కలిసే ఛాన్స్.. కేసీఆర్ సర్కార్‌పై ఫిర్యాదు ?

  Ts Politics: సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ..పైలట్ ప్రాజెక్ట్ గా మునుగోడు ఎంపిక..స్కిం మార్పు కలిసొచ్చేనా?

  ఈ క్రమంలోనే తన సారథ్యంలోని టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం దసరా రోజు ముహూర్తం ఖరారు చేశారు. అనుకున్న ముహూర్తానికే పార్టీ పేరు మార్పునకు సంబంధించిన తీర్మానంపై కేసీఆర్ సంతకం చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలంగాణ భవన్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం చేశాయి. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నాయి. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్.. దేశ రాజకీయాల్లోనూ మార్పు తీసుకొస్తారని.. కేసీఆర్ దేశ్‌కీ నేత అని నినాదాలు చేశాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu Naidu, CM KCR

  ఉత్తమ కథలు