TDP NARA LOKESH AND AYYANNA PATRUDU FAMILY SLAMS AP CM YS JAGAN OVER DEMOLITION ISSUE IN NARSIPATNAM GNT MKS
Ayyanna Patrudu : పులివెందుల పిల్లి భయపడింది.. ఇక చంపడమే మిగిలింది : టీడీపీ ఫైర్
గోడ కూల్చివేతపై అయ్యన్న సతీమణి పద్మావతి, కొడుకు రాజేశ్
‘జనం తరపున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా? బీసీలుగా పుట్టడమే నేరమా? రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలే కానీ ఆస్తులు ధ్వంసం చెయ్యడమేంటి? మమ్మల్ని చంపడమే మిగిలింది. మాకు జీవించే హక్కు లేదా?’ అని అయ్యన్న సతీమణి పద్మావతి అన్నారు..
టీడీపీ (TDP) నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి (Ayyanna Patrudu) ఇంటి గోడ కూల్చివేత వివాదాస్పదంగా మారింది. అన్ని అనుమతుల తర్వాతే నిర్మాణం జరిగిందని, తాము ఆక్రమణకు పాల్పడలేదని, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారులు, పోలీసులు రాత్రివేళ ఇంటికొచ్చి బీభత్సం సృష్టించారని అయ్యన్న కుటుంబం ఆరోపిస్తోంది.
అయితే, అధికారులు మాత్రం గోడను ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే కూల్చేసినట్టు చెబుతున్నారు. ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan)ను ఉద్దేశించి అయ్యన్న సతీమణి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇంటి గోడ కూల్చివేత అన్యాయమని, అయ్యన్న గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇక చంపడమే మిగిలిందని అయ్యన్న సతీమణి పద్మావతి అన్నారు. ‘జనం తరపున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా? బీసీలుగా పుట్టడమే నేరమా? మా ఇంటికి కరెంట్ నిలిపివేసి తెల్లవారు జామున కూల్చివేతకు దిగారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇళ్లు కూల్చివేస్తే మేం ఎక్కడ ఉండాలి? రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలే కానీ ఆస్తులు ధ్వంసం చెయ్యడమేంటి? మూడేళ్లుగా ప్రభుత్వం వేధింపులుకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కక్షతో టార్గెట్ చేసి రాజకీయాలతో చంపుతున్నారు. మమ్మల్ని కూడా చంపడమే మిగిలింది. మాకు జీవించే హక్కు లేదా?’ అని పద్మావతి ప్రశ్నించారు.
అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతపై టీడీజీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సైతం ఘాటుగా స్పందించారు. ‘నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడింది. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో చంద్రబాబు గారి పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి జడుసుకొని పిరికిపంద చర్యలు మొదలెట్టారు. అయన్నపాత్రుడుపై వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుంది’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడింది. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుంది.(1/3) pic.twitter.com/u7KIS1pmq4
ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఇవాళ పోలీసులు చుట్టుముట్టారు. నర్సీపట్నంలో అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్పై, మంత్రి ఆర్కే రోజాపై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫలితంగానే తాజా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
అనుచిత వ్యాఖ్యలతోపాటు స్థలం ఆక్రమణ వ్యవహారంలోనూ అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయ్యన్న ఇంటి వెనకాల గోడను బుల్డోజర్ (జేసీబీ)తో కూల్చివేశారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని.. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.