హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈడీ సోదాలు..కేంద్రంపై సుజనా ఫైర్

రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈడీ సోదాలు..కేంద్రంపై సుజనా ఫైర్

ఈడీ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటానని సుజనా చౌదరి చెప్పారు. జగన్ ఆస్తులకు తన ఆస్తులపై ఈడీ సోదాలకు సంబంధం లేదని స్పష్టంచేశారు.

ఈడీ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటానని సుజనా చౌదరి చెప్పారు. జగన్ ఆస్తులకు తన ఆస్తులపై ఈడీ సోదాలకు సంబంధం లేదని స్పష్టంచేశారు.

ఈడీ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటానని సుజనా చౌదరి చెప్పారు. జగన్ ఆస్తులకు తన ఆస్తులపై ఈడీ సోదాలకు సంబంధం లేదని స్పష్టంచేశారు.

  తమ నివాసాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలపై కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఈడీతో దాడులు చేయించిందని విమర్శించారు. తన కంపెనీల్లో పారదర్శకంగానే లావాదేవీలు జరిగాయని తెలిపారు. కోట్లు విలువ చేసే కార్లు, భవనాలు తనకు లేవని, ఈడీ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటానని ఆయన చెప్పారు. జగన్ ఆస్తులకు తన ఆస్తులపై ఈడీ సోదాలకు సంబంధం లేదని స్పష్టంచేశారు.

  సుజనా గ్రూప్‌ కింద మూడు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. నా కంపెనీల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగలేదు. అనామక కంపెనీతో నా కంపెనీకి సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నాకు ఎలాంటి విలువైన కార్లు, భవనాలు లేవు. ఈడి జప్తు చేసిన 6కార్లలో 3 కార్లు మా అబ్బాయి పేరుమీద ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న కారు విలువ కేవలం 3 లక్షలు మాత్రమే. రాజకీయంగా నన్ను దెబ్బతీసేందుకు కేంద్రం దాడులు చేయిస్తోంది. కంపెనీల్లో నేను ఎలాంటి ఫోర్జరీకి పాల్పడలేదు. లావాదేవీలన్ని పారదర్శకంగానే జరిగాయి. గత 29 ఏళ్లుగా నేనే ఆదాయపన్ను కడుతున్నా. బ్యాలెన్స్‌ షీట్‌లో ఉన్న రూ.5,700 కోట్లు అని ఒక్కరోజులో తేల్చేశారు. ఈడీ సోదాలను న్యాయబద్ధంగా ఎదుర్కొంటా. జగన్ ఆస్తులకు నా ఆస్తులపై సోదాలకు సంబంధం లేదు.
  సుజనా చౌదరి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు

  తనకు 120 కంపెనీలు ఉన్నాయని ఈడీ చెప్పిందని, అన్ని కంపెనీలు పెట్టవద్దని రూల్ ఉందా అంటూ సుజనా ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం నేరం కాదని..బ్యాంకులున్నదే అప్పులివ్వడానికని చెప్పుకొచ్చారు. బ్యాంకుల ఫిర్యాదుతోనే తన సంస్థలపై సోదాలు చేశారన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. తనపై ఏ బ్యాంకూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పీఎంఎల్ఐ యాక్ట్ ప్రకారమే సమన్లు ఇచ్చారని, అప్పుల కంటే తన ఆస్తుల విలువ ఎక్కువగానే ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానని సుజనా చౌదరి స్పష్టంచేశారు.

  శనివారం ఢిల్లీ, హైదరాబాద్‌లోని సుజనా నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ..ఈ నెల 27న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. సోదాల అనంతరం కీలక డాక్యుమెంట్లతో పాటు 6 ఖరీదైన కార్లను సీజ్ చేసింది. సుజనా గ్రూప్ కంపెనీలు బ్యాంకులకు రూ.5,700 కోట్లు పైగా ఎగవేసాయని ఈడీ తెలిపింది. సుజనాచౌదరి 120కిపైగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు కొల్లగొట్టారని.. ఆయన సంస్థల్లో పనిచేస్తున్నఉద్యోగులను డైరెక్టర్‌లుగా పెట్టి షెల్ కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలున్నాయి.

  First published:

  Tags: Enforcement Directorate, Sujana Chowdary

  ఉత్తమ కథలు