రీపోలింగ్ పేరుతో చంద్రగిరి ప్రజల్ని అవమానపరుస్తున్నారు : టీడీపీ ఎంపీ శివప్రసాద్

AP Assembly Election 2019 : ఎన్నికల ఫలితాలు మరో వారంలోపే వస్తుండగా... సడెన్‌గా చంద్రగిరి చుట్టూ రాజకీయ వేడి రగులుకుంటోంది. ఆయా పార్టీల నేతలంతా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 1:52 PM IST
రీపోలింగ్ పేరుతో చంద్రగిరి ప్రజల్ని అవమానపరుస్తున్నారు : టీడీపీ ఎంపీ శివప్రసాద్
శివప్రసాద్ (సినీ నటుడు, చిత్తూరు లోక్‌సభలో ఓటమి)
  • Share this:
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రీపోలింగ్ జరిపిస్తున్నట్లు ఈసీ ప్రకటించడంతో అక్కడి రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. చంద్రగిరిలో టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు విమర్శిస్తుంటే... అందుకు అదే స్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు టీడీపీ నేతలు. తాజాగా ఈ రీపోలింగ్ అవసరమే లేదన్నారు టీడీపీ ఎంపీ శివప్రసాద్. రీపోలింగ్ జరుగుతున్న గ్రామాలన్నీ వంద శాతం టీడీపీ గ్రామాలే అన్న ఆయన... వృధాగా పోలింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగి... ఫలితాలు వచ్చేందుకు టైం దగ్గర పడుతుంటే... సడెన్‌గా ఈ రీపోలింగ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆయన. రీపోలింగ్ జరపడమంటే చంద్రగిరి ప్రజలను అవమానపరచడమే అన్నారాయన. స్థానికులు ఎంతో శాంతియుతంగా పోలింగ్‌లో పాల్గొన్నారనీ, ఎలాంటి గొడవలూ జరగకపోయినా, ప్రజలు ఏదో తప్పు చేసినట్లు మళ్లీ పోలింగ్ పెట్టాలని వైసీపీ డిమాండ్ చెయ్యడం, అందుకు ఈసీ ఒప్పుకోవడం స్థానికులకు అవమానకర పరిణామం అన్నారు శివప్రసాద్.

రీపోలింగ్ పేరుతో వైసీపీ ఊహాలోకంలో విహరిస్తోందన్న శివప్రసాద్... ఒక్క ఓటు కూడా వైసీపీకి వెళ్లదని అన్నారు. ఎస్సీలు ఓటు వేయలేదనే కారణంతోనే రీపోలింగ్ జరుపుతున్నట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారనీ... తమను ఓటు వేయించకుండా ఆపితే, ఆగిపోయే పరిస్థితిలో అక్కడి ఎస్సీలు లేరని అన్నారు. తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి తిరగబడేంత ధైర్య సాహసాలు, పరిణతి ఎస్సీల్లో ఉందన్నారు ఆయన. ఎస్సీలను ఎంతో ఆదరించిన టీడీపీకి వారంతా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారని అన్నారు.

మోదీ, కేసీఆర్, జగన్, పవన్... ఇలా ప్రత్యర్థి పార్టీల నేతలంతా కలసి ప్రయోగం చేస్తున్నారనీ... అది విష ప్రయోగమా? లేక దాని వల్ల టీడీపీకే మేలు జరుగుతుందా? అన్నది మే 23న ఫలితాలతో తెలుస్తుందన్నారు ఎంపీ శివప్రసాద్. మొత్తానికి ఈ చిత్తూరు ఎంపీ... ప్రత్యర్థి పార్టీలకు గట్టిగానే కౌంటరిచ్చారంటున్నారు టీడీపీ నేతలు.

 

ఇవి కూడా చదవండి :

నేను దళిత యువతిని కాకపోయివుంటే, నన్ను రేప్ చేసేవాళ్లు కాదు : అళ్వార్ బాధితురాలు

మహిళను చంపి... ఆమె కడుపులో పిల్లాణ్ని మాయం చేశారు... ఎందుకంటే...పవన్ కళ్యాణ్‌ తుస్సు మనిపించాడు... తమ్మారెడ్డి భరద్వాజ అలా ఎందుకన్నారంటే...

500 మందికి పైగా ఎయిడ్స్ అంటించాడు... పాకిస్థాన్‌లో ఓ డాక్టర్ నిర్వాకం...
First published: May 17, 2019, 1:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading