• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • TDP MLCS MADE SERIOUS ALLEGATIONS ON MINISTER ANIL KUMAR YADAV DEMANDS TO RELEASE COUNCIL VIDEO FOOTAGE BA

మంత్రి అనిల్‌పై టీడీపీ సంచలన ఆరోపణలు.. వీడియో బయటపెట్టాలని డిమాండ్...

చంద్రబాబుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు (File)

శాసనమండలిలో మంత్రి అనిల్ ప్యాంట్ జిప్ తీసే ప్రయత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు అధికార వైసీపీ మంత్రులు, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై రెండు పార్టీలు ఎవరికి వారు తమ వాదన తాము వినిపిస్తున్నాయి. అయితే, ఘర్షణ జరిగిందని, మంత్రులను టీడీపీ ఎమ్మెల్సీలు కొట్టారని వాదిస్తున్న ప్రభుత్వం శాసనమండలి వీడియోలను బయటపెట్టాలని డిమాండ్ చేసింది. ‘మంత్రులపై దాడి జరిగిందంటున్న ప్రభుత్వం వీడియో పుటేజీలు భయటపెట్టాలి. ఉన్నది ఉన్నట్లు వీడియోలు విడుదల చేయాలి. సభలో మంత్రులు జిప్ తీయడం, తొడ కొట్టడం ఎక్కడా చూడలేదు. మంత్రులపై మేం దాడి చేయలేదు. మంత్రులు ప్రతిపక్ష సభ్యుల వైపే వచ్చి దాడి చేశారు.’ అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. సభలో మంత్రుల తీరు దారుణంగా ఉందని, మంత్రి అనిల్ ప్యాంట్ జిప్ తీసే ప్రయత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. శాసన మండలి లైవ్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇవాళ జరిగిన ఘటన వీడియోలు ఎడిట్ చేయకుండా విడుదల చేయాలని బాబూ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

    ద్రవ్య వినిమయ బిల్లు పెట్టమని తాము అడిగితే బిల్లు పెట్టేందుకు ఆర్థిక మంత్రి సిద్ధమయ్యారని, అయితే, ఆర్థిక మంత్రిని బొత్స ఆపారని మరో ఎమ్మెల్సీ అశోక్ ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందితే సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులు ఆగుతాయనే కుట్రతోనే బిల్లులను ఆపారన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు కోసం మళ్ళీ సీఆర్డీఏ రద్దు, రాజధాని తరలింపు బిల్లులు తేవాలని ముందస్తు ప్రణాళికతోనే ఇదంతా చేశారని అశోక్ బాబు అనుమానం వ్యక్తం చేశారు.

    శాసనమండలిని వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం చెప్పగానే వైసీపీ ఎమ్మెల్సీలు ఆయనపై దాడికి వెళ్లారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ సమయంలో లోకేష్ చేతిలో మొబైల్ ఉండడంతో వారు చేస్తున్న దౌర్జన్యకాండను వీడియో తీస్తున్నారనే అనుమానంతో వైసీపీ మంత్రులు లోకేష్ మీద దాడికి ప్రయత్నించారని టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. మంత్రులు వెల్లంపల్లి, కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్సీలు లోకేష్ వైపునకు దూసుకొచ్చారని చెప్పారు. లోకేష్ మీద దాడి చేస్తుండడంతో బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు వెల్లంపల్లిని అడ్డుకున్నారని చెప్పారు. ఎవరు దాడి చేశారో వీడియో బయటపెడితే మొత్తం తెలిసిపోతుందన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: