పోతిరెడ్డిపాడు వ్యవహారంలో జగన్ నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

‘ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203ని సమర్థిస్తున్నాం. రాయలసీమ వాసుల కోసం ఎవరు పోరాడినా అండగా ఉంటాం. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆర్థిక లావాదేవీల కోసం పోతిరెడ్డిపాడును నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదు.

news18-telugu
Updated: May 17, 2020, 2:53 PM IST
పోతిరెడ్డిపాడు వ్యవహారంలో జగన్ నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు ఏపీ సర్కారు విడుదల చేసిన జీవో 203పై తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం నడుస్తోంది. తమ నిర్ణయం సరైనదేనని.. జీవోను తప్పు పట్టాల్సిన అవసరమే లేదని వైసీపీ మంత్రులు, నేతలు చెప్పుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ఈ జీవోను తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే ఇంతవరకూ ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు పెద్దగా స్పందించలేదు. తొలిసారిగా కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. ఈ జీవో విషయంలో జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203ని సమర్థిస్తున్నాం. రాయలసీమ వాసుల కోసం ఎవరు పోరాడినా అండగా ఉంటాం. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆర్థిక లావాదేవీల కోసం పోతిరెడ్డిపాడును నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదు. సీఎం జగన్‌ ముందు చూపులేకుండా వ్యవహరిస్తున్నారు’ అని బీటెక్‌ రవి చెప్పుకొచ్చారు. రవి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
Published by: Narsimha Badhini
First published: May 17, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading