TDP MLC ASHOK BABU SENSATIONAL COMMENTS ON AP GOVERNMENT AND PRESENT UNION PRESIDENT NGS
Ashok Babu: రాజకీయ కుట్రలో భాగంగానే ఫిర్యాదు.. అదంతా ఆయన పనే.. అశోక్ బాబు సంచలన ఆరోపణలు
ఎమ్మెల్సీ అశోక్ బాబు
Ashok Babu: ఓ వైపు ఉద్యోగ సంఘాలు ఏపీ ప్రభుత్వంపై పోరాటం తీవ్ర చేస్తున్నారు. పీఆర్సీ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఇదే సమయంలో ఏపీ ఎన్జీవోల (APNGO) మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయితే ఇదంతా కుట్రలో భాగంగానే జరుగుతోందని.. దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అశోక్ బాబు.
Ashok Babu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉద్యోగ సంఘాలు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఒకప్పుడు సమైఖ్య ఉద్యమం సమయంలోనే వీరంతా వార్తల్లో నిలిచారు.. మళ్లీ ఇప్పుడు పీఆర్సీ సాధన కమిటీ పేరుతో మరో ఉద్యామాన్ని నడిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి (AP Government) వ్యతిరేకంగా అన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. కొత్తపీఆర్సీ (PRC) జీవోలను వెనక్కు తీసుకునే వరకు వెనక్కు తగ్గదే లే అంటూ నిరసనలు చేపడుతున్నారు. అంతేకాదు ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సమ్మెకు కూడా పిలుపు ఇచ్చారు.. ఇలాంటి సమయంలో ఏపీ ఎన్జీవోల (APNGO) మాజీ అధ్యక్షుడు, టీడీపీఎమ్మెల్సీ అశోక్ బాబు (MLC Ashok Babu)పై సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆయన బీకాం సర్టిఫికేట్ ను ట్యాంపిరింగ్ చేశారని.. దానికి సంబంధించి కేసు తనపై ఉంటే.. ఎలాంటి కేసులు తనపై లేవంటూ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొంటూ మోసం చేశారంటూ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయితే తనపై సీఐడీ (CID) కేసు నమోదు అయినట్లు వస్తున్న వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై సిఐడి కేసు నమోదు అయినట్టు కధనాలు వచ్చాయని, ఇది పాత సబ్జెక్ట్ అని పేర్కొన్నారు. ఇప్పుడు దాన్ని తెరపైకి తెచ్చింది ఎవరో.. ఇదంతా ఎందుకు చేస్తున్నారో కూడా తనకు తెలుసు అన్నారు.
అయితే ఆ వివాదం చిన్న టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల జరిగిందని.. అందుకే దాన్ని నేరం కింద పరిగణించారని అన్నారు. తాను ఉద్యోగుల సంఘంలో ఉండగా తన ప్రత్యర్థులు చేసిన ప్రయత్నం ఇప్పుడు ఈ కేసు అనిక పేర్కొన్నారు. డి కామ్ అనేది బి కామ్ గా తప్పుగా టైప్ అయ్యిందని, దీన్ని అదునుగా తీసుకుని తన ప్రత్యర్థులు తనపై ఫిర్యాదు చేశారని చెప్పారు అశోక్ బాబు. దీనిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరిగిందన్నారు. 2019 లోనే స్పష్టంగా నేరపురితంగా గాని, ఎలాంటి బెనిఫిట్స్ గాని ఏమి లేవని టెక్నీకల్ మిస్టేక్ వలన జరిగిన దానికి పనిష్మెంట్ అవసరం లేదని విచారణాధికారి రిపోర్ట్ కూడా ఇచ్చారని అశోక్ బాబు వివరణ ఇచ్చారు. ఆర్గనైజేషన్లో ఉన్న వైరం, టీడీపీలో ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేని వారు లోకాయుక్తకు ఓ ఉద్యోగితో ఫిర్యాదు చేయించారన్నారు. అయితే ప్రస్తుతం ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని అశోక్ బాబు ఆరోపించారు.
రాజకీయంగా తన ఎదుగుదల చూడలేక.. ఇలా దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారని అశోక్ బాబు అన్నారు. సూర్యనారాయణ ప్రభుత్వ మనిషి అని, ప్రభుత్వం అతన్ని హీరో చేసిందని అన్నారు. డిపార్ట్మెంట్ టెస్ట్ కూడా పాస్ కాలేని జీరో వ్యక్తిని హీరో చేసిందంటూ కామెంట్స్ చేశారు అశోక్ బాబు. అయితే పాత విషయాన్ని ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక వేరే ఉద్దేశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు..
ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న నేతలను బెదరించడానికి ఇలా తనపై లేని కేసులు తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంతో పెట్టుకుంటే ఇలా చేస్తామంటూ వార్నింగ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై చట్టబద్ధంగా పోరడతానని స్పష్టం చేశారు అశోక్ బాబు. రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. తాను ఏ విషయంలోనూ భయపడేది లేదని, సీబీఐ విచారణ కూడా చేసుకోవచ్చని అన్నారు. దీని గురించి ఉద్యోగులందరికీ తెలుసునని అన్నారు. ఉద్యోగ సంఘాల్లో పనిచేసినందుకే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోందని, ఇది సరి కాదన్నారు అశోక్ బాబు. ఉద్యోగుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. 2019 లోనే ఈ అంశం ముగిసిపోయిందని, దీనిపై ముందుగా లోకాయుక్త నోటీస్ ఇచ్చి సంజాయిషీ తీసుకోవాలన్నారు అశోక్ బాబు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.