ఉరవకొండలో ఆయన గెలిస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయం? ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతోందా ?

టీడీపీ ఎన్నికల గుర్తు

టీడీపీ తరపున పోటీ చేస్తున్న పయ్యావుల కేశవ్ ఏళ్లుగా ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. అయితే ఈసారి లగడపాటి తాజాగా ఇచ్చిన సర్వేతో ఆ సెంటిమెంట్ కాస్త బ్రేక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

  • Share this:
    ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గాల్లో ఉరవకొండ నియోజకవర్గం ఒకటి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేస్తున్న పయ్యావుల కేశవ్ ఏళ్లుగా ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. అయితే ఈసారి లగడపాటి తాజాగా ఇచ్చిన సర్వేతో ఆ సెంటిమెంట్ కాస్త బ్రేక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ... ఉరవకొండ శాసనసభ అనంతపురం జిల్లాలో ఉన్న 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. ఇక్కడ 2004లో శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థి పయ్యావుల కేశవ్ పోటీకి దిగారు. తన సమీప ప్రత్యర్థి సి.పి.ఎం. అభ్యర్థి అయిన వై.విశ్వేశ్వరరెడ్డిపై 8255 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కేశవ్‌కు 55756 ఓట్లు లభించగా, వై.విశ్వేశ్వరరెడ్డ 47501 ఓట్లు సాధించాడు. అయితే 2004లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేజెక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో 2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై 229 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. అప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీనే ఉమ్మడి ఏపీలో గెలుపు సాధించింది.

    2014 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ మరోసారి టీడీపీ నుంచి పోటీకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన విశ్వేశ్వరరెడ్డిపై ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో పయ్యావులకు 78,767 ఓట్లు రాగా... విశ్వేశ్వర రెడ్డి 81,042 ఓట్లు సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా టీడీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. అంటే పయ్యావుల గెలిచినప్పుడల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వ ఏర్పడలేదు. కాని అనూహ్యంగా ఓడిపోయినప్పుడు మాత్రం ఆ పార్టీ అధికారం కైవసం చేసుకుంది. అయితే తాజాగా 2019 ఏపీలో ఎన్నికల ఫలితాలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేలా ఉన్నాయి. ఎందుకంటే... ఏపీలో టీడీపీ గెలుపుతో పాటు...ఉరవకొండలో కూడా టీడీపీ విజయం సాధిస్తుందని లగడపాటి సర్వే తేల్చింది. దీంతో ఇప్పుడు టీడీపీలో పయ్యావుల సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా ? అని చర్చించకుంటున్నారు రాజికీయ నేతలు.
    First published: