హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఇక ఢిల్లీలో దబిడి దిబిడే -మోదీ, జగన్‌కు బాలయ్య వార్నింగ్ -ఆ పని చేయకపోతే హర్యానా తరహా ఉద్యమం

ఇక ఢిల్లీలో దబిడి దిబిడే -మోదీ, జగన్‌కు బాలయ్య వార్నింగ్ -ఆ పని చేయకపోతే హర్యానా తరహా ఉద్యమం

మోదీ జగన్ పై బాలయ్య గర్జన

మోదీ జగన్ పై బాలయ్య గర్జన

తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కూడా రాయలసీమపై వివక్ష కొనసాగుతున్నదని, కృష్ణా నీటి వాటాలో సీమకు మిగులు జలాలు కాకుండా నికర జలాలే కేటాయించాలని టీడీపీ ఎమ్మెల్యే, నట సింహం నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీలోని అన్ని ప్రాజెక్టులను కేంద్రం చేతికి అప్పగిస్తూ జగన్ సర్కారు జీవో జారీ చేసిన రోజే సీమ నీటి వాటాపై బాలయ్య సీరియస్ కామెంట్లు చేశారు..

ఇంకా చదవండి ...

అన్నపూర్ణగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కేంద్రం చేతికి అప్పగిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తెలుగు గడ్డపై కేంద్రం పెత్తనమేంటని గర్జించారు నట సింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రాయలసీమ నీటి వాటాలను కూడా తేల్చాలని, సీమకు మిగులు జలాలు కాకుండా నికర జలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనానికి సంబంధించిన జీవో అమలులోకి వచ్చిన నేపథ్యంలో టీడీపీ ‘రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తు’ పేరుతో హిందూపురంలో ఆదివారం ఒక సదస్సు నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే బాలయ్య హాజరై కీలక ప్రసంగంచేశారు..

సీమకు నికర జలాలు కావాలి..

అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు విడిపోయిన తర్వాత కూడా రాయలసీమకు నీటి అంశం ప్రధాన చర్చగా ఉంటోంది. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బాలకృష్ణ ఈ అంశంపై మరో నినాదాన్ని తెరపైకి తెచ్చారు. రాయలసీమకు మిగులు జలాలు కాదు.. కచ్చితమైన వాటా తేల్చి నికర జలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకప్పుడు రతనాల సీమగా ఉన్న రాయలసీమ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ దుస్థితికి చేరిందన్నారు. సీమకు తన వాటా నీళ్లు తెప్పించేదాకా తాను పోరాడుతానని బాలయ్య చెప్పారు.

చెరుకు రసం ఆశ చూపి.. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి.. యువకుడిపై అత్యాచారం -మగాణ్ని మగాడే: వారంలో రెండో ఘటన


మన హక్కులు కేంద్రం చేతుల్లోకా?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు పరిష్కారంగా ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవడం తెలిసిందే. ఈ మేరకు అంగీకరిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేయగా, కేసీఆర్ సర్కారు మాత్రం నీటి వాటాలు తేలేదాకా నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని వాదిస్తున్నది. సరిగ్గా కేసీఆర్ లైన్ లోనే ఇప్పుడు బాలకృష్ణ సైతం రాయలసీమ నీటి వాటాలు తేల్చాలని కోరుతున్నారు. రాష్ట్రల హక్కులు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని అంగీకరించబోనని బాలయ్య అన్నారు. గతంలో చేపట్టిన నదుల అనుసంధానం ప్రక్రియను పున:ప్రారంభించాలన్నారు.

Pawan Kalyan: ఎవరూ చేయలేని పనిని తలకెత్తుకున్న JanaSena -మాజీ సీఎం కోసం కోటి రూపాయలతో నిధి


జగన్ సర్కారుపై ఆగ్రహం

‘రాయలసీమలో పరిస్థితి చూసి నాడు ఎన్టీఆర్ హంద్రీనీవాకు శ్రీకారం చుట్టారు. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి జోలె పెట్టారు. తెలుగు గంగ ద్వారా కొంత వరకు సస్యశ్యామలం చేశారు. నీరు సమృద్ధిగా ఉన్నా హంద్రీనీవా ద్వారా అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వలేకపోయారు. 1400 చెరువులు ఉంటే కేవలం 130 చెరువులకు మాత్రమే నీరు ఇచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశమే లేదు. వాళ్లు ఎవర్నీ సంప్రదించరు. కనీసం కరవు మండలాలకైనా నీరు వచ్చేలా పథకాలు పూర్తి చేయాలని’అని జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాలయ్య.

నేను, వంశీ ఫోన్లు చేస్తే ఉమ ఎత్తట్లేదు -చాలా మంది టీడీపీ వాళ్లకు ఈ విషయం తెలీదు : kodali nani


ఇక ఢిల్లీలో హర్యానా తరహా ఉద్యమం..

సీమకు నికర జలాల కేటాయింపు, సీమ నీటి ప్రయోజనాల కోసం దేశ రాజధాని ఢిల్లీలో పోరాడటానికి సిద్ధమని బాలకృష్ణ చెప్పారు. నీటి వాటాల కోసం హర్యానా సాగించిన ఉద్యమం తరహాలోనే సీమ నీళ్ల కోసం ఉద్యమం లేవదీయాలని, దానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని బాలయ్య పిలుపునిచ్చారు. అంతకుముందు హిందూపురం వీధుల్లో బాలకృష్ణ ర్యాలీ చేపట్టారు. చౌడేశ్వరీ కాలనీలోని నివాసం నుంచి సదస్సు జరిగిన జేవీఎస్‌ ఫంక్షన హాల్‌ వరకు ర్యాలీగా వెళ్లారు.

Published by:Madhu Kota
First published:

Tags: Nandamuri Balarkrishna

ఉత్తమ కథలు